విందుతో రాజకీయ దుమారం
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:17 AM
ఉప్పలగుప్తం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఉప్పలగుప్తం మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానంపై మళ్లీ రసవత్తర చర్చలు నడుస్తున్నాయి. జంటిల్‌మెన్ ఒప్పందం ప్రకారం ప్రస్తుత ఎంపీపీ దంగేటి వీరఅచ్యుతజానకీ రాంబాబు పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఉప్పలగుప్తం -1 ఎంపీటీసీ చిక్కం త్రినాఽథకు ఎంపీపీ పీఠం కట్టబెట్టాలని 2021లో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఆ ప్రకారం చల్లపల్లికి చెందిన దంగేటి వీరఅ

తెరపైకి జంటిల్‌మన్ ఒప్పందం.. బొత్స, తోట ఆధ్వర్యంలో మంతనాలు
ఉప్పలగుప్తం ఎంపీపీ పదవిపై ఊపందుకున్న వ్యూహాలు
ఉప్పలగుప్తం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఉప్పలగుప్తం మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానంపై మళ్లీ రసవత్తర చర్చలు నడుస్తున్నాయి. జంటిల్‌మెన్ ఒప్పందం ప్రకారం ప్రస్తుత ఎంపీపీ దంగేటి వీరఅచ్యుతజానకీ రాంబాబు పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఉప్పలగుప్తం -1 ఎంపీటీసీ చిక్కం త్రినాఽథకు ఎంపీపీ పీఠం కట్టబెట్టాలని 2021లో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఆ ప్రకారం చల్లపల్లికి చెందిన దంగేటి వీరఅచ్యుతజానకీరాంబాబు మొదటి మూడున్నరేళ్లు, మిగిలినకాలం ఉప్పలగుప్తం-1 ఎంపీటీసీ చిక్కం త్రినాఽథ ఎంపీపీగా ఉండాలి. 2021 సెప్టెంబరు 24న దంగేటి వీరఅచ్యుతజానకీరాంబాబు ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేయగా, ఇప్పుడు మూడున్నరేళ్లు పూర్తవుతుండడంతో త్రినాఽథకు పదవి అప్పగించాలని వైసీపీలోని కొందరు నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఎంపీపీ భర్త దంగేటి రాంబాబు ముమ్మిడివరం మండలం చెయ్యేరుగున్నేపల్లి సత్తెమ్మ ఆలయం వద్ద మార్చి 26న ఎంపీటీసీలకు విందు ఏర్పాటుచేశారు. దానికి రెండ్రోజుల ముం దు రాంబాబు, త్రినాఽథ వర్గాల మధ్య ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుదిర్చిన ఒప్పందం ప్రకారం ప్రస్తుత ఎంపీపీ పూర్తికాలం పదవిలో కొనసాగుతారన్న వార్త వైరల్ అయ్యింది. ఇందులో భాగంగానే వైసీపీ ముఖ్య నేతలు, వైసీపీ, జనసేన, టీడీపీ ఎంపీటీసీలను ఎంపీపీ విందుకు ఆహ్వానించినట్టు సమాచారం. ప్రస్తుతం వైసీపీకి 11 ఎంపీటీసీలు, టీడీపీకి ఇద్దరు, టీడీపీలో చేరిన ఒక ఎంపీటీసీ, జనసేనకు ముగ్గురు ఎంపీటీసీలు ఉన్నారు. కూటమికి ఆరుగురు సభ్యుల బలం ఉన్నప్పటికీ ఎంపీపీపై అవిశ్వాసం పెట్టే సత్తా లేదని భావించిన వైసీపీ వ్యూహం ప్రకారం ఎంపీటీసీలకు విందు ఏర్పాటుచేసి సత్తెమ్మ సన్నిధిలో విజయోత్సవం చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో కొందరు ఎంపీటీసీలు అవాక్కయ్యారు. మొక్కుబడి అంటే విందుకు వెళ్లామే తప్ప, మరో కారణం కాదని కూటమి సభ్యులతో సహా వైసీపీలోని మరో వర్గం సభ్యులు చెబుతున్నారు. ఒప్పందాన్ని అతిక్రమించి ఎన్నికలకు వెళ్లిన త్రినాఽథకు జెంటిల్మన్ ఒప్పందం అమలు ప్రసక్తేలేదని మరొకవర్గం వ్యాఖ్యానిస్తోంది. దీంతో ఈ అంశం పరిష్కారం కోసం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రెండు వర్గాలను విడివిడిగా రప్పించుకుని మాట్లాడి అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు పరిష్కార బాధ్యతను అప్పగించారని వైసీపీ ముఖ్య నేతలు తెలిపారు.