MK Stalin: న్యాయ సమ్మతంగా పునర్విభజన
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:49 AM
జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించేలా ఈ ప్రక్రియ ఉండకూడదన్నదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభంలో స్టాలిన్ మాట్లాడారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అదే సమయంలో పునర్విభజన ప్రక్రియ సర్వజనామోదంగా, న్యాయసమ్మతంగా ఉండాలని డిమాండ్ చేశారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించేలా ఈ ప్రక్రియ ఉండకూడదన్నదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభంలో స్టాలిన్ మాట్లాడారు. ఒక రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఆహ్వానాన్ని అంగీకరించి ఇంతమంది రాజకీయ పార్టీల నేతలు సమావేశానికి రావడం ఆనందంగా ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అందరం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను (543) యధాతథంగా ఉంచి పునర్విభజన జరిపితే తమిళనాడులో ఎనిమిది ఎంపీ సీట్లు తగ్గుతాయని స్టాలిన్ పేర్కొన్నారు. పునర్విభజన వల్ల నష్టపోనున్న రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించామని, న్యాయసంబంధ ప్రక్రియపైనా దృష్టి సారించనున్నామని స్టాలిన్ పేర్కొన్నారు. నిరంతర కార్యాచరణ ద్వారానే హక్కులను పరిరక్షించుకోగలమన్నారు.
మోదీయే అన్నారుగా...?
2023లో తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాటలను స్టాలిన్ గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు 100 నియోజకవర్గాలు కోల్పోతాయని, ఇందుకు ఆ రాష్ట్రాల ప్రజలు సమ్మతిస్తారా? అంటూ నాడు ఆయన ప్రశ్నించారని స్టాలిన్ తెలిపారు. మోదీ మాటలను బట్టి పునర్విభజన వల్ల లోక్‌సభ సీట్లు తగ్గటం ఖాయమనే విషయం తేటతెల్లమవుతోందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News

దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..

వాహనదారులకు నిజంగా ఇది పిడుగులాంటి వార్త.. అదేంటో తెలిస్తే..

నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్నే మార్చాలంటారా?

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్ఫోర్స్
