Hyderabad: మద్యం మత్తులో బైక్‌తో సహా చెరువులోకి..
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:42 AM
మద్యం మత్తు వారి ప్రాణాలను బలిగొంది. మద్యం తాగి బైక్ పై చెరువు కట్టపై నుంచి వస్తుండగా అది అదునుతప్పి చెరువులో పడింది. దీంతో వారిద్దరూ మృతిచెందారు. మామా అల్లుళ్ల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

- మామా అల్లుళ్ల మృతి
హైదరాబాద్: మద్యం మత్తులో బైక్‌తో సహా మామాఅల్లుళ్లు చెరువులో పడి మృతిచెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్(Basheerabad Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలం నాగూరు గ్రామానికి చెందిన బాలాజీ(35) అతని మామ నాందేవ్(50) ఈనెల 22న కొంపల్లి ఉమామహేశ్వరకాలనీ(Kompally Umamaheswara Colony)కి వచ్చారు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరూ కలిసి బైక్‌పై బయటకు వెళ్లారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: వర్క్‌ఫ్రం హోం జాబ్ పేరిట కుచ్చుటోపీ..
మద్యం తాగి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఫాక్స్‌సాగర్ కట్టపై బైక్ అదుపుతప్పింది. ప్రమాదవశాత్తు వారు బైక్‌తో సహా చెరువులో పడిపోయారు. మరుసటిరోజు చెరువులో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలు బయటకు తీయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసునమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం
పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం
Read Latest Telangana News and National News