Student: బస్సు వెనుక విద్యార్థిని పరుగులు.. డ్రైవర్ సస్పెన్షన్
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:50 PM
బస్సు వెనుక విద్యార్థిని పరుగులు పెడుతున్నా ఆపకుండా బస్సును నడిపిన డ్రైవర్‌ను యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్ చేసింది. అలాగే విద్యార్థిని పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

చెన్నై: ఆగకుండా వెళ్లిన ప్రభుత్వ బస్సు వెనుక ప్లస్ టూ విద్యార్థిని పరుగులు తీస్తూ వెళ్లిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తిరుపత్తూర్ జిల్లా వాణియంబాడి బస్టాండ్ నుంచి మంగళవారం ఉదయం ఆలంగాయం వైపుకు ప్రభుత్వ బస్సు బయల్దేరింది. ఆ బస్సు కొత్తకోట బస్టాండ్ సమీపిస్తుండగా, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలకు వెళ్తున్న ప్లస్ టూ విద్యార్థిని బస్సు ఆపాలంటూ చేతులు ఊపింది. కానీ, డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు వెళ్లడంతో, దిగ్బ్రాంతికి గురైన విద్యార్థిని పరీక్షకు సకాలంలో హాజరుకాలేను అనే భయంతో బస్సు వెనుక పరుగులు తీసింది.
ఈ వార్తను కూడా చదవండి: Shihan Husseini: పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన గురువు ఇక లేరు..
కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపడంతో, సదరు విద్యార్థిని బస్సు ఎక్కింది. విద్యార్థిని బస్సు వెనుక వేగంగా పరుగులు తీస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వెలువడింది. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (విల్లుపురం రీజియన్) మేనేజింగ్ డైరెక్టర్, పరీక్ష రాసేందుకు పాఠశాలకు వెళ్లేందుకు వేచి ఉన్న విద్యార్థిని బస్సులో ఎక్కించుకోని కారణంగా డ్రైవర్ మునిరాజ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..
మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు
డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
Read Latest Telangana News and National News