Minister: రెండేళ్ళలో 20 లక్షల ల్యాప్ టాప్లు
ABN , Publish Date - Mar 22 , 2025 | 10:46 AM
ప్రభుత్వ ప్రకటించిన విధంగా రెండేళ్ళలో 20 లక్షల ల్యాప్ టాప్లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. దీనిపై ఎవరికి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

- మంత్రి తంగం తెన్నరసు
చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు రెండేళ్ళలో 20 లక్షల ల్యాప్ టాప్లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు అసెంబ్లీలో మంత్రి తంగం తెన్నరసు(Minister Thangam Tennarasu) వెల్లడించారు. అసెంబ్లీ సమావేశం హాలులో తన శాఖకు సంబంధించిన అంశాలపై శుక్రవారం మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ప్రజలు లబ్ధిపొందేలా వార్షిక బడ్జెట్ వుందన్నారు. ముఖ్యంగా గిరిజనులు ఆర్ధికంగా, హక్కుల పరంగా అభివృద్ధిచేందేలా బడ్జెట్ రూపొందించినట్లు వివరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Amit Shah: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో శాంతి
రాష్ట్రంలో రైల్వే పనుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఈ మూడేళ్ళలో రూ.19.68 కోట్లు విడుదల చేసిందని, అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇంతకంటే ఎక్కువగా నిధులను కేటాయిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. కోయంబత్తూరు జిల్లాలో కోవై, పల్లడం ప్రాంతాల్లో రెండు సెమీ కండక్టర్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సిప్కాట్ ద్వారా 32 ఐటీ పార్కులను రూపొందించామని, మరోవైపు సమాచార సంకేతిక పార్కులను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
2021 అసెంబ్లీ ఎన్నికల డీఎంకే మేనిఫెస్టోలో ప్రకటించిన అల్పాహార పథకం విజయవంతంగా కొనసాగుతోందని, ఇక గృహిణుల కోసం ప్రవేశపెట్టిన నెలకు రూ.1,000 పథకంలో 1.15 మంది లబ్దిపొందేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. క్రీడాశాఖకు సంవత్సరానికి రూ.300 కోట్లను మంజూరు చేస్తున్నట్లు సభలో ఆయన తెలిపారు. రాబోయే రెండేళ్ళలో విద్యార్ధిని, విద్యార్ధులకు రూ.10వేల విలువైన 20 లక్షల లాప్‌టా్‌పలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, తొలివిడత నిధులను కూడా కేటాయించిందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచడం లేదు
మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News