Share News

Stalin JAC meeting Delimitation: డీలిమిటేషన్‌‌పై జేఏసీ భేటీ.. పోరాటం ఆగదని స్టాలిన్ స్పష్టీకరణ

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:22 PM

తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నై వేదికగా జేఏసీ మీటింగ్ ప్రారంభమైంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన జరగకూడదని తేల్చి చెప్పారు.

Stalin JAC meeting Delimitation: డీలిమిటేషన్‌‌పై జేఏసీ భేటీ..  పోరాటం ఆగదని స్టాలిన్ స్పష్టీకరణ

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో తమకు అన్యాయం జరుగుతుందంటున్న దక్షిణాది రాష్ట్రాలు తమ వాణిని బలంగా వినిపించేందుకు ఉమ్మడి కార్యాచరణకు దిగాయి. ఈ దిశగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో శనివారం చెన్నైలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్దితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సభలో ప్రసంగించిన సీఎం స్టాలిన్.. నియోజకవర్గ పునర్విభజన న్యాయబద్ధంగా జరిగే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు. ‘‘ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన జరగకూడదు. మనం దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గితే మన వాణిని వినిపించే శక్తి కూడా తగ్గిపోతుంది’’ అని స్టాలిన్ అన్నారు.


‘‘ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఏ చర్యను మేము వ్యతిరేకించట్లేదు. ఇది న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేయకూడదు. ఈ నిరసన నియోజకపునర్విభజనకు వ్యతిరేకంగా కాదు.. న్యాయబద్ధంగా పునర్విభజన జరగాలి’’ అని ఆయన అన్నారు.

Also Read: ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో శాంతి

ఈ మీటింగ్‌లో మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన 14 రాష్ట్రాల రాజకీయ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నేతలతో పాటు పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు, జేఏసీ మీటింగ్ జరుగుతున్న వేదిక బయట బీజేపీ ధర్నాకు దిగింది. తమిళ నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై నల్ల షర్టు ధరించి తమ నిరసన తెలిపారు. రాష్ట్రంలో వాస్తవ సమస్యలను పట్టించుకోకుండా డీఎమ్‌కే రాజకీయ నాటకానికి తెరతీసిందని అన్నారు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్‌లో స్కామ్‌, మహిళలకు ఎదురవుతున్న వేధింపులు, ఇతర ప్రభుత్వ వైఫల్యాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు డీఎమ్‌కే ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పలు అంతర్రాష్ట్ర వివాదాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మేకెదాటు డ్యామ్ నిర్మించేందుకు కర్ణాటక పట్టుదలతో ఉందని, కేరళ తన చెత్తనంతా తమిళనాడులో కుమ్మరిస్తోందని అన్నారు.


Also Read: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

రాష్ట్రాల మధ్య ఇన్ని వివాదాలు అపరిష్కృతంగా ఉన్నా స్టాలిన్ నిస్సిగ్గుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను సమావేశాలకు పిలిచారని మండిపనడ్డారు. కేరళ, కర్ణాటకతో ఉన్న జలవివాదాలను పరిష్కరించేందుకు ఇలాంటి సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

Read Latest and National News

Updated Date - Mar 22 , 2025 | 12:32 PM