Share News

Amit Shah: ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో శాంతి

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:30 AM

యూపిఏ హయాంలో ఉగ్రవాదులను కీర్తించడంతో పాటు ఉగ్రవాదుల శవాలతో అంత్యక్రియలు జరిగేవని, ప్రస్తుతం ఉగ్రవాదులను హతమార్చిన చోటే పూడ్చిపెడుతున్నామన్నారు.

Amit Shah: ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో శాంతి

న్యూఢిల్లీ, మార్చి21: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాదం విషయంలో యువత ప్రమేయం దాదాపు కనుమరుగైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో చెప్పారు. యూపిఏ హయాంలో ఉగ్రవాదులను కీర్తించడంతో పాటు ఉగ్రవాదుల శవాలతో అంత్యక్రియలు జరిగేవని, ప్రస్తుతం ఉగ్రవాదులను హతమార్చిన చోటే పూడ్చిపెడుతున్నామన్నారు. 2004 నుంచి 2014 మధ్య 7,2,17 ఉగ్రవాద ఘటనలు జరిగితే 2014 నుంచి 2024 మధ్య 2,242 ఘటనలు జరిగాయన్నారు. ఉగ్రవాదం కారణంగా జరిగే మరణాల సంఖ్య 70 శాతం తగ్గిందన్నారు. ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించడం లేదని యూరీ, పుల్వామా ఘటనల తర్వాత పది రోజుల వ్యవధిలోనే సర్జికల్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌ జరిపి గట్టిగా బదులిచ్చామన్నారు. 2024లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.



ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 06:30 AM