FIIs: యూటర్న్ తీసుకున్న ఎఫ్ఐఐలు.. భారత స్టాక్ మార్కెట్ ఇక పైపైకేనా..
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:21 PM
విదేశీ మదుపర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడం, బ్యాంకింగ్ షేర్ల రాణింపుతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతం మేర పెరిగాయి. గత ఐదు రోజుల వ్యవధిలోనే భారత మార్కెట్లకు రూ.22లక్షల కోట్ల సంపద వచ్చి చేరింది.

బిజినెస్ న్యూస్: కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్(Indian Stock Market)ను పాతాళంలోకి నెట్టుకుంటూ వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (Foreign Institutional Investors) ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. కొన్ని రోజులుగా భారీ అమ్మకాలు, చిన్నా చితకా కొనుగోళ్లు జరుపుకుంటూ వచ్చి ఎఫ్ఐఐలు నిన్న (శుక్రవారం) బిగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. మార్చి 21న అంటే నిన్న ఏకంగా రూ.7,470 కోట్ల మేర అధిక మొత్తంలో కొనుగోలు చేశారు. ఈ ఏడాదిలో వారి అత్యధిక ఈక్విటీ కొనుగోలు ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ మరింత ర్యాపిడ్ స్పీడ్‌తో దూసుకుపోతుందా? అనే ఆశలు నిన్నటి మార్కెట్ తీరు చూస్తే అర్థమవుతోంది.
దీంతో వరసగా ఐదురోజులపాటు బుల్ రన్ చేస్తున్న భారత మార్కెట్లు మరింతగా పుంజుకున్నాయి. ఫలితంగా భారత మార్కెట్లకు రూ.22లక్షల కోట్ల సంపద వచ్చి చేరింది. విదేశీ మదుపర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడం, బ్యాంకింగ్ షేర్ల రాణింపుతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు ఒక శాతం మేర పెరిగాయి. దీన్ని అదునుగా తీసుకున్న డీఐఐలు డొమెస్టిక్ ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మకాలకు దిగారు. రూ.3,202.26 కోట్ల మేర షేర్లను ఆఫ్ లోడ్ చేశారు. ఫారిన్ ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇదే ధోరణి కొనసాగిస్తే భారత మార్కెట్లు 'వి' షేప్ రికవరీని చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold and Sliver Prices: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇక బంగారం కొనగలమా..
Baroda MDGinext Mobile App: ఆ కస్టమర్ల కోసం బీవోబీ సరికొత్త ప్రయత్నం.. ఇంత అంతా సులువే