Share News

US Deportation: భారత వలసదారులతో స్వదేశానికి వచ్చిన మూడో అమెరికా విమానం

ABN , Publish Date - Feb 16 , 2025 | 10:42 PM

అక్రమ వలసదారులతో మూడో అమెరికా విమానం తాజాగా భారత్‌కు చేరుకుంది. అమృతసర్‌లోని శ్రీగురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం విమానం దిగింది.

US Deportation: భారత వలసదారులతో స్వదేశానికి వచ్చిన మూడో అమెరికా విమానం

ఇంటర్నెట్ డెస్క్: అక్రమవలసదారులతో మూడో అమెరికా విమానం తాజాగా భారత్‌కు చేరుకుంది. అమృతసర్‌లోని శ్రీగురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం విమానం దిగింది. ఈ విడతలో మొత్తం 112 భారతీయులను అమెరికా భారత్‌కు పంపించింది. వీరిలో 44 మంది హర్యానాకు చెందిన వారు కాగా గుజరాత్‌కు చెందిన 33 మంది, పంజాబ్‌కు చెందిన 31 మంది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి చెరో ఒకరు ఉన్నారు.


Jayalalitha Assets: అమ్మ ఆస్తులు.. పూర్తయిన అప్పగింతలు

శనివారం కూడా మరో అమెరికా విమానంలో 117 మంది భారతీయ అక్రమవలసదారులు స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. వీరిలో 65 మంది పంజాబ్‌కు చెందిన వారు కాగా 33 మంది హర్యానా వారు ఉన్నారు. కాగా, తమ చేతులకు బేడీలు వేసి భారత్‌కు పంపించారని కొందరు మీడియాకు తెలిపారు. భారత్‌కు వచ్చిన వారిలో ఇద్దరి పోలీసులు హత్యానేరం కేసులో అరెస్టు చేశారు. పాటియాలో 2023లో జరిగిన ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న సందీప్, ప్రదీప్ సింగ్‌లను అరెస్టు చేశారు.


Delhi CM: ఢిల్లీ కొత్త సీఎంపై నిరీక్షణకు తెర.. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఫిక్స్

భారతీయ అక్రమ వలసదారులతో తొలి అమెరికా విమానం ఫిబ్రవరి 5న భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తొలి దశలో 105 మంది భారత్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి వారిని తరలించడం స్వదేశంలో వివాదాస్పదంగా మారింది. దీంతో, భారత్ ఈ అంశంపై తన అభ్యంతరాలను అమెరికాతో పంచుకుంది. అయితే, ఖైదీలకు ఇలా సంకెళ్లు వేయడం అమెరికా పోలీసులు అనుసరించే ప్రామాణిక పద్ధతని విదేశాంగ శాఖ మంత్రి పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు. బేడీల వినియోగానికి సంబంధించి భారత్‌లో కఠిన నిబంధనలు అమలువుతన్నాయి. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం, పోలీసులకు బేడీలు వినియోగించడం పరిపాటిగా మారకూడదు. వీలైనంత వరకూ అదనపు సిబ్బందిని భద్రత కోసం వినియోగించి నిందితులు, అనుమానితులను తరలించాలి.

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2025 | 10:44 PM