Share News

భార్య, ఆమె ప్రియుడి దారుణం.. భర్తను కారుతో గుద్దించి..

ABN , Publish Date - Mar 31 , 2025 | 03:56 PM

Gwalior News: రజ్నీ తరచుగా పుట్టింటికి వెళుతూ ఉండేది. దీంతో అనిల్‌కు అనుమానం వచ్చింది. ఆమె మీద నిఘా పెట్టాడు. అప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన పుట్టింటి దగ్గర ఉండే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.

భార్య, ఆమె ప్రియుడి దారుణం.. భర్తను కారుతో గుద్దించి..
Gwalior News

గ్వాలియర్: ప్రియుడితో కలిసి భర్తను హతమారుస్తున్న భార్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట భార్య ఘాతుకాలు వెలుగులోకి వస్తున్నాయి. మీరట్‌లో సౌరభ్ అనే మర్చంట్ నేవీ ఆఫీసర్‌ను భార్య దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను ముక్కలుగా కోసి, డ్రమ్‌లో పడేసింది. ఈ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలే దేశ వ్యాప్తంగా చాలా జరిగాయి. రాజస్థాన్‌లోని ఓ భార్య అయితే.. ప్రియుడితో కలిసి భర్తను కారుతో ఢీకొట్టింది. అతడు కారు కిందపడ్డ తర్వాత కొన్ని మీటర్ల వరకు ఊడ్చుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, గ్వాలియర్‌లోని తారాగంజ్‌కు చెందిన అనిల పాల్, రజ్నీ పాల్ భార్యాభర్తలు. 2016లో వీరిద్దరికీ పెళ్లయింది.


పెళ్లయిన కొన్ని నెలల వరకు వీరి కాపురం సాఫీగానే సాగింది. తర్వాతి నుంచి భార్య వేధింపులు మొదలయ్యాయి. పిల్లల భవిష్యత్తు కోసం అతడు మౌనంగా ఉండిపోయాడు. రజ్నీ మాత్రం తన పంథా మార్చుకోలేదు. అనిల్‌ను వేధిస్తూనే ఉండేది. తరచుగా పుట్టింటికి వెళుతూ ఉండేది. దీంతో భర్తకు అనుమానం వచ్చింది. ఆమె మీద నిఘా పెట్టాడు. అప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రజ్నీ .. పుట్టింటి దగ్గర ఉండే మంగల్ సింగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. ఒకటి రెండు సార్లు వారిద్దరూ కలిసి తిరగటం కూడా చూశాడు. మార్చి 20వ తేదీన కూడా రజ్నీ పుట్టింటికని చెప్పి వెళ్లింది. అనిల్ ఆమెను ఫాలో అయ్యాడు.


ఆమె మంగల్‌తో కారులో తిరగటం చూశాడు. కారును అడ్డగించాడు. మంగల్ తన కారును అతడి మీదకు పోనిచ్చాడు. అనిల్ కారు కిందపడిపోయాడు. అయినా మంగల్ కారు ఆపలేదు. ముందుకు పోనిచ్చాడు. కొన్ని మీటర్ల వరకు కారు అతడ్ని ఈడ్చుకుంటూ వెళ్లింది. అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. భార్య, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు రజ్నీ ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. బుధవారం ఇంటికి వచ్చింది. అతడిపై బెదిరింపులకు పాల్పడింది. దీంతో భయపడిపోయిన అనిల్ ఎస్పీ ఆఫీస్‌లో కంప్లైంట్ చేశాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తాళి కట్టిన భర్తను కారు కిందపడేసి


ఇవి కూడా చదవండి:

Nidhi Tewari: చిన్న వయసులోనే ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా.. ఎవరీ నిధి తివారీ

నూడుల్స్ పోటీలో

Updated Date - Mar 31 , 2025 | 05:02 PM