Share News

Python Viral Video: ఈత కొడుతున్న పిల్లలు.. కాళ్లకు తగిలిన కొండచిలువ.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Mar 29 , 2025 | 09:20 AM

కొందరు పిల్లలు పెద్ద కాలువలో ఈత కొడుతుంటారు. అంతా సంతోషంగా ఈత కొడుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కొండచిలువ నీటిలో ఈదుకుంటూ వారి వద్దకు వస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Python Viral Video: ఈత కొడుతున్న పిల్లలు.. కాళ్లకు తగిలిన కొండచిలువ.. చివరకు జరిగింది చూస్తే..

కొండచిలువలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం చుట్టేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులపై కూడా చేయడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కొండచిలువకు సంబంధించిన తమాషా వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు పిల్లలు ఈత కొడుతుండగా.. పెద్ద కొండచిలువ కాళ్లకు తగిలింది. చివరకు జరిగిన ఘటన చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్లు పిల్లలు కాదు పిడుగులు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పిల్లలు (Children swimming in canal) పెద్ద కాలువలో ఈత కొడుతుంటారు. అంతా సంతోషంగా ఈత కొడుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కొండచిలువ నీటిలో ఈదుకుంటూ వారి వద్దకు వస్తుంది. కాళ్లకు ఏదో తగిలినట్లుగా అనిపించడంతో చేత్తో పట్టుకుని చూస్తారు.

Viral Video: బ్రష్‌తో బైక్‌నే నడిపించాడుగా.. ఇతడి టెక్నిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..


కొండచిలువ అని తెలిసి కూడా ఏమాత్రం భయపడకుండా (Children playing with python) దాని తోక పట్టుకుని ఆడకుంటారు. కొండచిలువ కూడా ఆశ్చర్యకరంగా వారికి ఎలాంటి హానీ చేయదు. దీంతో ఆ పిల్లలు మరింత రెచ్చిపోతారు. చివరకు కాలువ గట్టు పైకి ఎక్కిన పిల్లలు.. కొండచిలువ తోక పట్టుకుని పైకి లాగేస్తారు. ఇలా కొండచిలువను ఆటబొమ్మను చేసి ఆడుకున్న ఈ పిల్లలను చూసి అంతా అవాక్కవుతున్నారు.

Train Viral Video: అది రైలా లేక లాడ్జీనా.. లోపల మరీ ఇలా సెట్ చేశారేంట్రా బాబోయ్..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీళ్లేంటీ ఏకంగా కొండచిలువతోనే ఆడుకుంటున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48 వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 29 , 2025 | 09:20 AM