Share News

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Mar 20 , 2025 | 02:52 PM

చాలా మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇలాంటి వారిని ఆకట్టుకుని ఫాలోయింగ్ పెంచుకునేందుకు కొందరు విచిత్రమైన వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వైరల్ అయ్యేందుకు వింత పనులు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..
Girl did a strange act

ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు (Smart Phones) ఉంటున్నాయి. ముఖ్యంగా చాలా మంది సోషల్ మీడియాకు బానిసల్లా మారిపోయారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనే (Social Media) ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇలాంటి వారిని ఆకట్టుకుని ఫాలోయింగ్ పెంచుకునేందుకు కొందరు విచిత్రమైన వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వైరల్ అయ్యేందుకు వింత పనులు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


@y_iamcrazyy అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ రైల్వే స్టేషన్ మెట్లపై చిత్రీకరించారు. ఆ మెట్ల మీద వరుసగా చాలా మంది ప్రయాణికులు కూర్చుని ఉన్నారు. హఠాత్తుగా ఓ యువతి పై మెట్టు మీద నుంచి పడిపోయి కిందకు జారుకుంటూ వచ్చేసింది. ఆ యువతికి ఏమైందో అని కొందరు కంగారు పడ్డారు. కొందరు మాత్రం తమకేమీ పట్టునట్టు కూర్చున్నారు. కిందకు దొర్లుకుంటూ వచ్చి పడిన అమ్మాయి కాసేపటి తర్వాత పైకి లేచి నవ్వుకుంటూ వెళ్లిపోయింది. ఆమె చేష్టలను మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5.3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇలాంటి వారి పిచ్చి ముదరకుండా దేవుడే కాపాడాలని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ప్రస్తుతం ప్రజలు రీల్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఆ అమ్మాయిని శిక్షించాలని చాలా మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

IQ Puzzle: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ట్యాంకుల్లో ముందుగా ఏది నిండుతుందో కనిపెట్టండి..


Viral Stunt Video: వామ్మో.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే అబ్బురపోవాల్సిందే.. వీడియో వైరల్..


Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2025 | 02:52 PM