Share News

రోబో ప్రేయసి..

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:31 AM

కంప్యూటర్‌ కాలంలో ఒంటరితనాన్ని పోగొట్టే అందమైన రోబోలూ రాబోతున్నాయి. అలాంటి ఏఐ రోబోనే ‘అరియా’. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ప్రేయసిలాంటిది. ఇటీవల లాస్‌వెగాస్‌లో జరిగిన ‘కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో 2025’లో ప్రదర్శించిన ‘అరియా’ కోసం నెటిజన్లు తెగ వెదకడంతో... సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

రోబో ప్రేయసి..

కంప్యూటర్‌ కాలంలో ఒంటరితనాన్ని పోగొట్టే అందమైన రోబోలూ రాబోతున్నాయి. అలాంటి ఏఐ రోబోనే ‘అరియా’. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ప్రేయసిలాంటిది. ఇటీవల లాస్‌వెగాస్‌లో జరిగిన ‘కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో 2025’లో ప్రదర్శించిన ‘అరియా’ కోసం నెటిజన్లు తెగ వెదకడంతో... సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసే రోబోల గురించి వినే ఉంటారు. బరువులు మోసే రోబోల గురించి చదివే ఉంటారు. ఇకముందు ఒంటరితనాన్ని దూరం చేసే రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను చూస్తారు. ఈ రోబో ప్రేయసి కావాలనుకుంటే కొనుక్కోవచ్చని తయారీ సంస్థ ప్రకటించింది కూడా. అమెరికాకు చెందిన ‘రియల్‌ బొటిక్స్‌’ అనే సంస్థ ఈ సరికొత్త రోబోను తయారుచేసింది. ఈ ఏఐ రోబో మెడ దగ్గర 17 మోటార్లు అమర్చారు. నోరు, కంటి కదలికల కోసం మోటర్లు ఉపయోగపడతాయి. ఈ హ్యూమనాయిడ్‌ రోబో ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్స్‌ సహాయంతో రకరకాల ఫేషియల్‌ అటాచ్‌ మెంట్స్‌ను గుర్తిస్తుంది. అంతేకాదు... గుర్తించిన ఫేషియల్‌కు అనుగుణంగా తన ప్రవర్తనను మార్చుకుంటుంది.



ధర రూ. కోటిన్నర

నల్లటి ట్రాక్‌ సూట్‌ ధరించి ఎలక్ట్రానిక్‌ షోలో సందడి చేసిన అరియా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మూడు వెర్షన్లలో ఈ రోబో అందుబాటులో ఉంది. మెడ, తల మాత్రమే ఉండే బస్ట్‌ వెర్షన్‌ రోబో ధర సుమారు రూ.8 లక్షలుగా నిర్ణయించారు. మాడ్యులర్‌ వెర్షన్‌ రోబో ధర రూ. ఒక కోటి. అడ్వాన్స్‌డ్‌ ఫుల్‌ స్టాండింగ్‌ మోడల్‌ రోబో ధర రూ. కోటిన్నరగా నిర్ణయించారు. ‘‘ఒంటరితనం ఎంతగా బాధిస్తుందో తెలిసిందే. ఒంటరితనాన్ని దూరం చేసి, వారికి ఆప్యాయతానురాగాలను అందించే రోబోలను తయారు చేయాలన్నది మా కంపెనీ లక్ష్యం’’ అని రియల్‌ బొటిక్స్‌ సంస్థ సీఈఓ ఆండ్రూ కిగుయెల్‌ అన్నారు.

book5.2.jpg


ఈ రోబో సహచరురాలిగా, రొమాంటిక్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తుందని సంస్థ చెబుతోంది. అంతేకాదు ఇది అందర్నీ బాగా గుర్తుపెట్టుకుంటుంది. ‘‘రోబో తయారీలో నడక, ముఖ కవళికలు వంటివి కీలక అంశాలుగా ఉంటాయి. మేం ముఖ కవళికలపై ఎక్కువ దృష్టి సారించాం. భావోద్వేగాలను సృష్టించే రోబో తయారీపై ఆసక్తితో ఉన్నాం’’ అని ఆండ్రూ కిగుయెల్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో రోబో గర్ల్‌ఫ్రెండ్స్‌ వైపే అందరూ దృష్టిసారించినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది నిపుణుల మాట.

Updated Date - Feb 09 , 2025 | 11:31 AM