UP: భార్యకు లవర్‌తో వివాహం.. అసలు కారణం ఇదే
ABN , Publish Date - Mar 28 , 2025 | 07:33 AM
ప్రేమించిన వ్యక్తితో భార్యకు వివాహం చేసి పెద్దమనసు చాటుకున్నాడు అంటూ ప్రశంసలు పొందుతున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బబ్లూ అనే వ్యక్తి. అయితే అతడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం వేరే ఉంది. అసలు నిజం తెలిసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. తెలివైన నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు.

భార్య మరొకరిని ప్రేమించిందని తెలుసుకున్న భర్త.. ఆమెను అతడికిచ్చి వివాహం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భార్యకు వివాహం చేయడం మాత్రమే కాక.. ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా అతడే తీసుకున్నాడు. ఈ ఘటన మీడియా, సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ అయ్యింది. అందరూ ఆ భర్తను తెగ పొగిడారు. భార్య సంతోషం కోసం ఎంత పెద్ద త్యాగం చేశాడో.. ఎంత మంచి మనిషో అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అతడు భార్యకు పెళ్లి చేసింది. ఆమె మీద ప్రేమతో కాదట.. మరి ఎందుకంటే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బబ్లూ అనే వ్యక్తి.. తన భార్య రాధిక మరో వ్యక్తిని ప్రేమించింది అని తెలుసుకున్నాడు. దాంతో వారిద్దరికి తానే దగ్గరుండి వివాహం జరిపించాడు. అయితే బబ్లూ ఇలా చేయడానికి గల కారణం చావు భయమట. అవును ఈ మధ్య కాలంలో ప్రేమించిన వాడి కోసం భర్తను చంపుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. మార్చి నెలలోనే ఇలాంటి రెండు సంఘటనలు వెలుగు చూశాయి.. అవి కూడా ఉత్తరప్రదేశ్‌లోనే కావడం గమనార్హం. మేరఠ్‌కు చెందిన ముస్కాన్ రస్తోగి అనే మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. ముక్కలుగా నరికి సిమెంట్ డ్రమ్ములో పెట్టింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పెళ్లైన రెండు వారాలకే..
మరో కేసులో తల్లిదండ్రుల బలవంతం మీద ప్రేమించిన వాడిని కాదని.. మరో వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ.. పెళ్లైన రెండు వారాలకే.. భర్తను హత్య చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చింది. భర్తను చంపి లవర్‌తో కలిసి ఉండాలని భావించి.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటనలు చూసిన బబ్లూ.. తనకు కూడా అదే పరిస్థితి కలుగుతుందేమో అనే భయంతోనే భార్యను ఆమె ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించానని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా బబ్లూ పీటీఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. "మేరఠ్‌లో ఏం జరిగిందో చూశాం కదా. ప్రేమించిన వాడి కోసం భర్తను అత్యంత దారుణంగా చంపేసింది ఓ మహిళ. నా భార్య కూడా మరో వ్యక్తిని ప్రేమించిందని తెలిసింది. ఇప్పుడు నేను ఆమె మీద అరిచినా, గొడవపెట్టుకున్నా లాభం లేదని అర్థం అయ్యింది. పైగా వారిని అడ్డుకుంటే.. నన్ను కూడా చంపేస్తారేమో అని భయం వేసింది. వారి నుంచి నన్ను నేను కాపాడుకోవడం కోసం.. నా భార్యకు, ఆమె ప్రియుడికి వివాహం చేశాను" అని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు అతడో త్యాగశీలి అని పొగిడిన వారంతా.. అతడు చెప్పిన కారణం విన్న తర్వాత.. తెలివైన నిర్ణయం తీసుకున్నావు.. లేదంటే నువ్వు కూడా ఎక్కడో శవంగా తేలేవాడివి అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
భార్యను చంపి.. అత్తామామలకు ఫోన్..
దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో..