Couple Viral Video: అయ్యో.. నడిరోడ్డు మీద ఏంటీ పని? జంట చేష్టలు చూసి అవాక్కవుతున్న జనం..
ABN , Publish Date - Feb 05 , 2025 | 10:15 AM
చాలా మంది తమ కళ్ల ముందు ఏం జరిగినా, తమకు విచిత్రంగా అనిపించినది జరిగినా వెంటనే తమ మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తమ కళ్ల ముందు ఏం జరిగినా, తమకు విచిత్రంగా అనిపించినది జరిగినా వెంటనే తమ మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ జంట (Couple) నడి రోడ్డు మీద అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ప్రవర్తిస్తోంది (Viral Video).
@VishalMalvi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇద్దరు యువతీ యువకులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ అబ్బాయి షర్టు వెనుక వైపు చిరిగిపోయి ఉంది. కాసేపు కలిసి నడిచిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కొట్టడం ప్రారంభించాడు. అయినా ఆ అమ్మాయి వదలకుండా ఆ అబ్బాయి వెనుకాలే వెళ్తూ అతడిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయిని అబ్బాయి నడిరోడ్డు మీదే కొట్టడం ప్రారంభించాడు. అయినా ఆ అమ్మాయి మాత్రం అతడిని వదలలేదు. చూడడానికి ఆ ఇద్దరూ ప్రేమికులులా ఉన్నారు. ఏదో విషయానికి గొడవ పడి రోడ్డు మీదే గొడవపడుతున్నారు.
నడిరోడ్డు మీద వారిద్దరి గొడవను చిత్రీకరించిన ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7.3 లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. దాదాపు 4 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇదేదో అర్జున్ రెడ్డి సినిమాలో సీన్‌లా ఉంది``, ``అయ్యో.. ఏం జరిగింది?``, ``ఇది నిజంగా దారుణం``, ``ఆ అమ్మాయి అతడిని ఎందుకు వదలడం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
Viral Video: గూగుల్ మ్యాప్స్‌కే షాకిచ్చాడుగా.. కుంభమేళాలో ఓ వ్యక్తి విచిత్ర ఆలోచన.. నెటిజన్లు ఫిదా..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి