Airplane Food Taste: విమానాల్లో ఇచ్చే ఆహారం రుచి వేరుగా ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? దీనికి కారణం ఏంటంటే..
ABN , Publish Date - Mar 24 , 2025 | 05:38 PM
విమానాల్లో ప్రయాణికులకు ఇచ్చే ఆహారంలో రుచి లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్స్ రుచిగా ఉండదని జనాలు తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. రుచీపచీ లేకుండా చప్పిడి వంటకాల్లో ఉంటాయని అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా సుదీర్ఘ దూరాలు విమానం ప్రయాణం చేసేవారికి ఇలాంటివి అనుభవమే. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలీదు. ఫలితంగా ఎయిర్‌లైన్స్ సంస్థలను తప్పుబడుతుంటారు. చేసేదేమీ లేక సర్దుకుపోతుంటారు. అయితే, ఈ పరిస్థితి పూర్తిగా ఎయిర్‌లైన్స్‌ను నిందించలేమని నిపుణులు చెబుతున్నారు.
విమానాల్లో ఆహారం రుచికి సంబంధించి జర్మన్ సంస్థ లుఫ్తాన్సా కొంత కాలం క్రితం ఓ అధ్యయనం చేసింది. 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు మనుషుల నాలికపై ఉండే టేస్ట్ బడ్స్ వాటి సున్నితత్వాన్ని కొంత కోల్పోతాయి. తీపిని, ఉప్పును గుర్తించే సామర్థ్యాన్ని 30 శాతం వరకూ కోల్పోతాయి. అంత ఎత్తున ఉన్నప్పుడు గాల్లో తేమ కూడా తగ్గుతుంది. ఫలితంగా ఆహారంలోని సువాసనలను గుర్తించే శక్తి కూడా తగ్గుతుంది. అటు రుచి, ఇటు వాసన చూసే శక్తి కూడా తగ్గడంతో విమానాల్లో ఆహారం రుచీపచీ లేనట్టు ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది.
Also Read: ప్రపంచంలో బాగా పాప్యులర్ అయిన ఈ విండోస్ వాల్‌పేపర్ చరిత్ర గురించి తెలిస్తే..
ఇక ప్రయాణికులు కోసం భారీ స్థాయిలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు సహజంగానే రుచిలో మార్పు ఉంటుందట. రెస్టారెంట్లలో ఉన్న రుచి కుదరదని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆహారం రుచిని పెంచేందుకు ఎయిర్‌లైన్స్ వాటికి ఉప్పు, తీపిని ఎక్కువగా జోడిస్తాయి. ఇద కూడా వాటి రుచిపై ప్రభావం చూపిస్తుంది. డీహైడ్రేషన్‌కు దారి తీసి ఆహారం మరింత చప్పిడిగా మారేలా చేస్తాయి.
Read Also: కరెన్సీ నోట్లను ధ్వంసం చేస్తే శిక్షలు ఇవే
ఇక లాభాలు పెంచుకునే క్రమంలో విమానయాన సంస్థలు కూడా ఆహారాన్ని తక్కువ ఖరీదు కలిగిన ముడిసరుకులతో చేస్తాయి. ఫలితంగా ఫుడ్స్ రుచి తగ్గుతుంది.
నేలపై వండిన ఆహారాన్ని విమానాల్లోకి చేరుస్తారు. అక్కడ మళ్లీ వేడి చేసి ప్రయాణికులకు ఇస్తారు. ఇలా పలుమార్లు వేడి చేయడం వల్ల ఫుడ్ రుచిలో మార్పు వస్తుందని చెబుతున్నారు. ఇలా పలు కారణాలు ఏకమై విమానాల్లో ఫుడ్స్ రుచి కోల్పోయేలా చేస్తాయని అంటున్నారు.
Read Also: డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా