Share News

Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. సడన్‌గా సమీపానికి దూసుకొచ్చిన చేప.. చివరకు..

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:49 PM

సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద ఆక్వేరియంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి జలకన్య వేషంలో ఆక్వేరియంలోకి దిగింది. ఆమె చూసేందుకు అచ్చం జలకన్య తరహాలో ఉండడంతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. సడన్‌గా సమీపానికి దూసుకొచ్చిన చేప.. చివరకు..

జలకన్యలు నిజంగా ఉన్నారా, లేరా అనే విషయం పక్కన పెడితే.. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు జలకన్య వేషంలో దర్శనమిస్తుంటారు. అలాగే మరికొందరు ఈ దుస్తులు ధరించి నీటిలోకి కూదా దిగుతుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి జలకన్య వేషంలో నీటిలోకి దిగింది. ఈ క్రమంలో ఓ భారీ చేప ఆమె సమీపానికి దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద ఆక్వేరియంలో (Aquarium) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి జలకన్య వేషంలో (woman dressed as mermaid) ఆక్వేరియంలోకి దిగింది. ఆమె చూసేందుకు అచ్చం జలకన్య తరహాలో ఉండడంతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Viral Video: వామ్మో.. వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. తలుపు తీసి చూడగా లోపలి నుంచి ఒక్కసారిగా..


అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అదే ఆక్వేరియంలో ఉన్న ఓ భారీ చేప అటుగా వచ్చింది. జలకన్య వేషంలో ఉన్న యువతిని చూసి.. ఆదేదో వింత చేప అనుకుంది. దగ్గరికి రాగానే (fish attacked young woman) ఒక్కసారిగాఆమెపై దాడి చేసి, తల కొరికే ప్రయత్నం చేసింది. చేప దాడితో షాక్ అయిన యువతి... చివరకు అతి కష్టం మీద దాన్నుంచి తప్పించుకుని వేగంగా ఈదుకుంటూ నీటిపైకి వెళ్లింది.

Viral Jobs: లవ్ ఫెయిల్యూరా.. అయితే మీరు అదృష్టవంతులే.. ఈ కంపెనీలో బంపరాఫర్..


ఈ ఘటనలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటనే భయంగా ఉంది’’.. ‘‘ఆ చేపకు దంతాలు ఉండవు కాబట్టి.. ఆమె క్షేమంగా ఉంటుందని భావిస్తున్నాం’’.. అంటూ మరికొందరు కామంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 లక్షలకు పైగా లైక్‌లు, 178 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రాణాలంటే లెక్కే లేదా.. ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 31 , 2025 | 12:49 PM