Share News

తోటి బాక్సర్‌పై గుడ్డుతో దాడి!

ABN , Publish Date - Feb 27 , 2025 | 03:38 AM

బ్రిటన్‌ బాక్సర్లు ఇయుబాంక్‌ జూనియర్‌-కానర్‌ బెన్‌ ఏప్రిల్‌ 26న బౌట్‌లో తలపడనున్నారు. ఆ బౌట్‌కు సంబంధించి మంగళవారం ఇక్కడ జరిగిన ప్రచార కార్యక్రమంలో బెన్‌ మొహంపై క్రిస్‌ కోడిగుడ్డు విసరడం...

తోటి బాక్సర్‌పై గుడ్డుతో దాడి!

మాంచెస్టర్‌: బ్రిటన్‌ బాక్సర్లు ఇయుబాంక్‌ జూనియర్‌-కానర్‌ బెన్‌ ఏప్రిల్‌ 26న బౌట్‌లో తలపడనున్నారు. ఆ బౌట్‌కు సంబంధించి మంగళవారం ఇక్కడ జరిగిన ప్రచార కార్యక్రమంలో బెన్‌ మొహంపై క్రిస్‌ కోడిగుడ్డు విసరడం సంచలనం రేపింది. వాస్తవంగా 2022లోనే క్రిస్‌-కానర్‌ తలపడాల్సి ఉంది. కానీ కానర్‌ బెన్‌ డోప్‌ పరీక్షకు హాజరు కాలేదు. దాంతో ఆ బౌట్‌ ఆగిపోయింది. ‘డోప్‌’కు రాకపోవడంతో కానర్‌పై సస్పెన్షన్‌ విధించారు. అది ఇటీవల పూర్తి కావడంతో ఇద్దరు బాక్సర్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక.. కానర్‌ నాటి నిర్వాకాన్ని గుర్తు చేస్తూ అతడిపై కోడిగుడ్డు కొట్టినట్ట్టు ఇయు బాంక్‌ జూనియర్‌ తెలిపాడు. ఈ ఘటన తర్వాత ఇద్దరు బాక్సర్ల భద్రతా సిబ్బంది మధ్య తోపులాట చోటుచేసుకుంది. దాంతో వాతావరణం ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది.


ఇవి కూడా చదవండి..

Wasim Akram about Pakistan Team: కోతులు కూడా మీ కంటే చాలా బెటర్.. పాకిస్తాన్ టీమ్‌పై అక్రమ్ సంచలన వ్యాఖ్యలు..


Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..


Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..


మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2025 | 03:38 AM