లక్ష్య పరాజయం
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:40 AM
ప్రపంచ బాక్సింగ్ కప్‌లో తొలిరోజు భారత ఆటగాడు లక్ష్య చాహర్‌కు నిరాశ ఎదురైంది. బ్రెజిల్‌లోని ఫోజ్ డొ గువాకులో మంగళవారం జరిగిన 80 కిలోల...

ప్రపంచ బాక్సింగ్ కప్
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ కప్‌లో తొలిరోజు భారత ఆటగాడు లక్ష్య చాహర్‌కు నిరాశ ఎదురైంది. బ్రెజిల్‌లోని ఫోజ్ డొ గువాకులో మంగళవారం జరిగిన 80 కిలోల విభాగం ఆరంభ బౌట్‌లో లక్ష్య 0-5తో స్థానిక బాక్సర్ వాండెర్లీ పెరీరా చేతిలో ఓటమి పాలయ్యాడు. రెండోరోజు పోటీల్లో భారత బాక్సర్లు జదుమాని సింగ్ (50 కిలోలు), నిఖిల్ దూబే (75 కిలోలు), జుగ్నూ (85 కిలోలు) తలపడనున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..