Share News

CSK vs MI MS Dhoni Stumping: మిల్లీ సెకన్‌లో రనౌట్.. ధోని మనిషా.. రోబోనా..

ABN , Publish Date - Mar 23 , 2025 | 09:58 PM

CSK vs MI 2025: సీఎస్‌కే సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మరోమారు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు. మెరుపు స్టంపింగ్‌తో పిచ్చెక్కించాడు. ఇది కచ్చితంగా చూసి తీరాల్సిన డిస్మిసల్ అనే చెప్పాలి.

CSK vs MI MS Dhoni Stumping: మిల్లీ సెకన్‌లో రనౌట్.. ధోని మనిషా.. రోబోనా..
MS Dhoni

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ అండ్ ఎనర్జిటిక్ అవుతున్నాడు. 43 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫిట్‌గా ఉన్న మాహీ.. కుర్రాళ్లతో పోటీపడుతున్నాడు. ఐపీఎల్-2025తో తాను ఎంత ఫిట్‌గా ఉన్నదీ అతడు మరోమారు నిరూపించాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కళ్లుచెదిరే స్టంపింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు ధోని. స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను స్టంపౌట్‌‌తో వెనక్కి పంపించాడు. అయితే ఇది కేవలం మిల్లీ సెకన్‌ గ్యాప్‌లో చేయడంతో అంతా గుడ్లు తేలేశారు.


రెప్పపాటులో..

నూర్ వేసిన బంతి గుడ్‌ లెంగ్త్‌లో పడి ఒక్కసారి అనూహ్యంగా టర్న్ అయింది. అప్పటికే కాస్త కుడి కాలిని పైకి లేపిన సూర్యకుమార్.. ఎడమ కాలి మీదే భారం పెట్టి ఆఫ్ సైడ్ బంతిని తరలిద్దామని అనుకున్నాడు. కానీ పిచ్ అయ్యాక వేగంగా వచ్చిన బంతి.. షార్ప్ టర్న్ అయి అతడి బ్యాట్‌ను దాటుకొని తుర్రుమని వెళ్లిపోయింది. అంతే బంతిని అందుకున్న ధోని.. రెప్పపాటులో బెయిల్స్ పడేశాడు. 0.12 సెకన్ వ్యవధిలో బంతిని అందుకొని స్టంపింగ్ చేసేశాడు. దీంతో కాలు క్రీజులోకి పెట్టినా అప్పటికే బెయిల్స్ పడటంతో సూర్య షాక్ అయ్యాడు. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు ఔట్ అవడంతో మిస్టర్ 360 బిత్తరపోయాడు. ఈ స్టంపింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.


ఇవీ చదవండి:

రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..

సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్

సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2025 | 10:07 PM