టీమిండియాకు రూ. 58 కోట్లు
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:03 AM
చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టోర్నీ ఆసాంతం దుమ్ము రేపిన జట్టుకు రూ. 58 కోట్లు...

చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు బీసీసీఐ రివార్డు
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టోర్నీ ఆసాంతం దుమ్ము రేపిన జట్టుకు రూ. 58 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆటగాళ్లు, శిక్షణ, సహాయ సిబ్బంది, జాతీయ సెలెక్షన్ కమిటీ సభ్యులకు ఈ నగదు అందజేయనున్నట్టు పేర్కొంది. ఈ రివార్డులో 15 మంది జట్టు ఆటగాళ్లు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు రూ. మూడు కోట్ల చొప్పున లభిస్తాయి. మిగిలిన మొత్తంలో ఇతర సహాయ సిబ్బంది, సెలెక్షన్ కమిటీ సభ్యులు రూ. 50 లక్షల చొప్పున అందుకుంటారు.
ఇవి కూడా చదవండి..
Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధనశ్రీ వర్మకు విడాకులు.. మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి