Share News

Glenn Maxwell: కొత్త ఏడాది తొలి రోజే మ్యాక్స్‌వెల్ సంచలనం.. ఇది క్యాచ్ ఆఫ్ ది ఇయర్

ABN , Publish Date - Jan 01 , 2025 | 06:44 PM

BBL: బౌండరీ లైన్ దగ్గర క్యాచులు పట్టడం అంత ఈజీ కాదు. ఫోర్ లైన్ ఎక్కడ ఉందో మైండ్‌లో ఉంచుకోవాలి. గ్రౌండ్ మెజర్‌మెంట్స్ పక్కా ఐడియా ఉండాలి. అంత ప్రెజర్‌లోనూ బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ బంతిని అందుకోవడంతో పాటు ఫోర్ లైన్ దాటకుండా ఉండాలి. ఇవన్నీ చాలా కష్టం కాబట్టే బౌండరీ లైన్ క్యాచుల్ని బెస్ట్ క్యాచెస్‌గా ఎక్స్‌పర్ట్స్ అభివర్ణిస్తుంటారు.

Glenn Maxwell: కొత్త ఏడాది తొలి రోజే మ్యాక్స్‌వెల్ సంచలనం.. ఇది క్యాచ్ ఆఫ్ ది ఇయర్
Glenn Maxwell

బౌండరీ లైన్ దగ్గర క్యాచులు పట్టడం అంత ఈజీ కాదు. ఫోర్ లైన్ ఎక్కడ ఉందో మైండ్‌లో ఉంచుకోవాలి. గ్రౌండ్ మెజర్‌మెంట్స్ పక్కా ఐడియా ఉండాలి. అంత ప్రెజర్‌లోనూ బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ బంతిని అందుకోవడంతో పాటు ఫోర్ లైన్ దాటకుండా ఉండాలి. ఇవన్నీ చాలా కష్టం కాబట్టే బౌండరీ లైన్ క్యాచుల్ని బెస్ట్ క్యాచెస్‌గా ఎక్స్‌పర్ట్స్ అభివర్ణిస్తుంటారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పట్టిన తీరే దీనికి మచ్చుతునక. ఇప్పుడు దీన్ని మరిపించే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. దాని గురించి మరింతగా చూద్దాం..


వాటే క్యాచ్..

బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ దుమ్మురేపుతుంటాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. కళ్లుచెదిరే క్యాచులతో మ్యాచులను మలుపు తిప్పుతుంటాడు. తాజాగా మరో బ్యూటిఫుల్ క్యాచ్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు మ్యాక్సీ. బ్రిస్బేన్ బ్యాటర్ విల్ ప్రెస్ట్‌విడ్జ్ కొట్టిన బంతి సిక్స్‌కు వెళ్తుండగా.. పరిగెత్తుకుంటూ వచ్చిన మ్యాక్సీ పర్ఫెక్ట్ జంప్‌తో దాన్ని అందుకొని గ్రౌండ్‌ లోపలకు నెట్టాడు. క్షణం వ్యవధిలో బౌండరీ లైన్ లోపలకు వచ్చి దాన్ని అందుకున్నాడు. అతడు జంప్ చేసిన తీరు, టైమింగ్, బాడీ బ్యాలెన్స్, బంతి మీద గురి ఈ క్యాచ్‌ను చాలా స్పెషల్‌గా మార్చేశాయి. దీన్ని చూసిన నెటిజన్స్ ఏడాది తొలి రోజే క్యాచ్ ఆఫ్ ది ఇయర్‌ను మ్యాక్సీ అందుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

టీమిండియాకు నయా కోచ్.. గంభీర్ పోస్టు ఊస్టే..

ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

టీమిండియాలో ఇంటి దొంగ

టీమ్‌లో నుంచి వెళ్లిపో.. పంత్‌కు గంభీర్ వార్నింగ్

For More Sports And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 06:48 PM