IND vs ENG: టీమిండియాకు బ్యాడ్ లక్.. టాస్‌లో ఇలా జరిగిందేంటి
ABN , Publish Date - Jan 31 , 2025 | 07:04 PM
Suryakumar Yadav: పూణె టీ20లో మ్యాచ్‌కు ముందే భారత్‌కు షాక్ తగిలింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. టీమిండియా ఎలా కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలి.

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో టీ20లో గెలిచి సిరీస్‌ను పట్టేయాలని అనుకుంది. పూణెలో బట్లర్ సేనను చిత్తు చేయాలని డిసైడ్ అయింది. అందుకు తగ్గట్లే ఫుల్ ప్రిపరేషన్‌తో గ్రౌండ్‌లోకి దిగింది. కానీ మ్యాచ్‌కు ముందే భారత్‌కు బెడిసి కొట్టింది. టాస్ విషయంలో సూర్య సేనకు లక్ కలసిరాలేదు. ఈ సిరీస్‌లోని గత మూడు మ్యాచుల్లో టాస్ నెగ్గిన భారత్.. కీలకమైన నాలుగో టీ20లో మాత్రం టాస్ ఓడిపోయింది. దీంతో మన జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది.
టాస్ ఎఫెక్ట్ ఎంత?
ఈ సిరీస్‌లో గత మూడు మ్యాచుల్లోనూ టీమిండియా టాస్ నెగ్గడం, ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం జరిగాయి. కానీ నాలుగో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది సూర్య సేన. చేజింగ్ అలవాటైన భారత్.. ఈ మ్యాచ్‌లో టార్గెట్ సెట్ చేయడం, దాన్ని కాపాడుకోవడంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అసలే కెప్టెన్ సూర్యకుమార్ సహా సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా ఫామ్‌లో లేరు. మరి.. భారత్ గెలుపు అవకాశాలపై టాస్ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో చూడాలి.
ఇవీ చదవండి:
కాళ్లు మొక్కిన కోహ్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే
భార్య మాటలకు అశ్విన్ షాక్.. అతడ్ని ప్రేమిస్తున్నావా అని అడగడంతో..
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి