Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. ఎంత పనాయె బుమ్రా
ABN , Publish Date - Feb 12 , 2025 | 08:29 AM
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అనుకున్నదే అయింది. బుమ్రా విషయంలో టీమ్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇది కప్ అవకాశాలను ఎంత మేర ప్రభావం చేస్తుందో చూడాలి.

న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోపీ (సీటీ) ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఝలక్ తగిలింది. వెన్ను నొప్పి నుంచి కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. మంగళవారం రాత్రి ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. సిటీ కోసం తమ తుది జట్లను ప్రకటించేందుకు మంగళవారమే తుది గడువుగా ఉంది. దీంతో బుమ్రా స్థానంలో మరో పేసర్ హర్షిత్ రాణాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఆఖరి టెస్టులో బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే.
అయితే తను ఇంకా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేదని బోర్డు పేర్కొంది. బుమ్రా లేకపోవడంతో జట్టు బౌలింగ్ బలహీనంగా మారినప్పటికీ దేశవాళీ. ఐపీఎల్లో విశేషంగా రాణించిన రాజుపై సెలెక్టర్లు నమ్మక ముంచారు. మరోవైప ప్రాథమిక జట్టులో బైస్వాల్ ఉన్నప్పటికీ. అతడి స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సీటీ జట్టులో చోటు కల్పించారు. ఇక నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లలో సిరాజ్, దూవేలతో పాటు తైస్వాల్ ఉండనున్నాడు.
భారత్ తుది జట్టు: రోహిత్ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్ కోహ్లి, శ్రేయాన్, రాహుల్, పంత్, హార్దిక్, లక్షర్, సుందర్, కుల్దీప్, రాణా, షమి, జడేజా, వరుణ్.