CSK vs RCB IPL 2025: సాల్ట్ ఔట్.. ఆర్సీబీకి తొలి షాక్
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:07 PM
బెంగళూరుకు తొలి షాక్ తగిలింది. ధోనీ అద్భుత స్టంపింగ్‌తో సాల్ట్ పెవిలియన్ బాట పట్టాడు

సీఎస్కే టాస్ గెలవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న సాల్ట్‌ను ధోనీ అద్భుత స్టంపింగ్‌తో పెవిలియన్ బాట పట్టించాడు. ఓపెనర్లుగా వచ్చిన సాల్ట్ కోహ్లీతో కలిసి భారీ స్కోరు కోసం ప్రయత్నించాడు. తొలి ఓవర్ మొదటి మూడు బంతులను కలీక్ అహ్మద్ డాట్స్ వేశాడు. కానీ నాలుగు ఐదు బంతుల్లో ఫిల్ సాల్ట్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఆరంభంలోనే దూకుడు కనబరిచాడు. తొలి ఓవర్ ముగిసే సరికి స్కోరకు 9కి చేరుకుంది.
రవిచంద్రన్ బౌలింగ్‌లో కూడా సాల్ట్ దూకుడు కొనసాగించాడు. మొదటి బంతిని సిక్స్‌గా మార్చిన అతడు రెండు, చివరి బంతిని ఫోర్ బాదాడు. ఇక ఖలీల్ వేసిన మొదటి బంతి కోహ్లీ ప్యాడ్స్‌కు తాకింది. సీఎస్కే రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. ఈ ఓవర్‌లో కూడా సాల్ట్ ఓ ఫోర్ కొట్టాడు. ఇక మూడు ఓవర్లు ముగిసే సరికి కోహ్లీ 11 బంతుల్లో ఐదు పరుగులు చేయగా సాల్ట్ 15 బంతుల్లో 32 పరుగులు చేశాడు. కానీ ధోనీ అద్భుతం చేయడంతో ఆర్సీబీ స్పీడుకు బ్రేకులు పడ్డాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి