Share News

జోరు సాగాలని..

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:48 AM

సాగర తీరాన మరో హోరాహోరీ ఐపీఎల్‌ పోరుకు వేళైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. వైజాగ్‌ను రెండో సొంత...

జోరు సాగాలని..

వైజాగ్‌లో సన్‌రైజర్స్‌తో క్యాపిటల్స్‌ ఢీ

విశాఖపట్నం: సాగర తీరాన మరో హోరాహోరీ ఐపీఎల్‌ పోరుకు వేళైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. వైజాగ్‌ను రెండో సొంత మైదానంగా ఎంచుకున్న ఢిల్లీ..లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో ఉత్కంఠగా జరిగిన తొలి పోరులో ఒక వికెట్‌తో గెలిచింది. ఈ గెలుపుతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న ఢిల్లీ..అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. పైగా..స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టులో చేరడంతో క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ మరింత పటిష్టమైంది. మరోవైపు సొంతగడ్డ ఉప్పల్‌లో..రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగడంతో ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోరుతో హైదరాబాద్‌ భళా అనిపించింది. బ్యాటర్లతోపాటు బౌలర్లూ సత్తా చాటడంతో ఘనమైన బోణీ కొట్టింది. కానీ ఉప్పల్‌లోనే లఖ్‌నవూతో జరిగిన రెండో మ్యాచ్‌లో 5 వికెట్లతో ఓడిన సన్‌రైజర్స్‌.. నెట్‌ రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీతో జరిగే పోరులో బలంగా పుంజుకోవాలని హైదరాబాద్‌ పట్టుదలగా ఉంది.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..

మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది

Updated Date - Mar 30 , 2025 | 03:52 AM