Share News

ఫైనల్లో జొకోవిచ్‌, మెన్సిక్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:56 AM

టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మియామీ ఓపెన్‌లో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. సింగిల్స్‌ సెమీఫైనల్లో...

ఫైనల్లో జొకోవిచ్‌, మెన్సిక్‌

మియామీ గార్డెన్స్‌ (ఫ్లోరిడా): టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మియామీ ఓపెన్‌లో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. సింగిల్స్‌ సెమీఫైనల్లో 4వ సీడ్‌ జొకోవిచ్‌ 6-2, 6-3తో దిమిత్రోవ్‌ (బల్గేరియా)ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే తుదిపోరులో 19 ఏళ్ల అన్‌సీడెడ్‌ జాకుబ్‌ మెన్సిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)తో జొకో తలపడనున్నాడు. మరో సెమీస్‌లో జాకుబ్‌ 7-6(7/4), 4-6, 7-6(7/4)తో మూడో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ను చిత్తుచేశాడు.

Updated Date - Mar 30 , 2025 | 04:32 AM