Share News

ఇక నుంచి.. జూనియర్లకు నజరానాల్లేవ్‌!

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:19 AM

దేశంలోని జూనియర్‌ అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. జూనియర్‌ స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ పతకాలు సాధించినా, వారికి ఇక నుంచి ఎటువంటి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేది లేదని...

ఇక నుంచి.. జూనియర్లకు నజరానాల్లేవ్‌!

న్యూఢిల్లీ: దేశంలోని జూనియర్‌ అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. జూనియర్‌ స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ పతకాలు సాధించినా, వారికి ఇక నుంచి ఎటువంటి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేది లేదని క్రీడా మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. ఆ మేరకు సవరణలు చేసిన పాలసీ ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. క్రీడారంగంలో పెడ ధోరణులుగా మారిన డోపింగ్‌, వయసుకు సంబంధించిన అవకతవకలకు చెక్‌ చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వం తెలిపింది. గత పాలసీ ప్రకారం జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం సాధిస్తే రూ. 13 లక్షలు, ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల విజేతలుగా నిలిస్తే రూ. 5 లక్షలు నజరానాగా ఇచ్చేవారు. జూనియర్‌ ఈవెంట్లు అనేవి పతకాల కోసం కాదు.. అథ్లెట్ల వికాసం కోసమేననే ఉద్దేశాన్ని తెలియజెప్పడమే ఈ నిర్ణయం వెనుకనున్న ప్రధాన ఉద్దేశమని ఓ అధికారి చెప్పాడు. ‘భారత్‌లో మాత్రమే జూనియర్‌ అథ్లెట్లకు అనవసరమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా వారు చిన్నవయసులోనే విపరీతంగా సాధన చేస్తున్నారు. ఎలిట్‌ స్థాయికి చేరుకొనే సరికి అలసి పోవడమో లేదా వారిలో ఆసక్తి చచ్చిపోవడమో చూస్తున్నామ’ని సదరు అధికారి వివరించాడు.


ఇవీ చదవండి:

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్.. 90 బంతుల్లో ఖేల్ ఖతం.. టీ20లను మించేలా..

ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. కావ్యా పాప టీమ్ అంటే మినిమం ఉండాలి

‘సన్‌రైజర్స్‌’బ్యాడ్మింటన్‌లో కొత్త స్కోరింగ్‌ విధానం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 09 , 2025 | 04:45 AM