Share News

మ్యాచ్‌లన్నీ ఒక్కచోటే ఆడిస్తే ఎలా?

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:09 AM

చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లోనే నిర్వహించడాన్ని పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. రోహిత్‌ సేన ఎక్కడికీ వెళ్లకుండా ఒకే వేదికపై...

మ్యాచ్‌లన్నీ ఒక్కచోటే ఆడిస్తే ఎలా?

టీమిండియా షెడ్యూల్‌పై మాజీల విమర్శ

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లోనే నిర్వహించడాన్ని పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. రోహిత్‌ సేన ఎక్కడికీ వెళ్లకుండా ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడడం వారికి లాభిస్తోందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు గుర్తు చేశారు. ‘భారత జట్టు కేవలం దుబాయ్‌లోనే మ్యాచ్‌లు ఆడడం వారికి ఎంతో కొంత లాభిస్తుంది’ అని మైక్‌ అథర్టన్‌ అన్నాడు. అలాగే యూఏఈలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలమనే అంచనాతో భారత జట్టు ఎక్కువ మంది స్పిన్నర్లను తీసుకుందని నాసిర్‌ హుస్సేన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ‘భారత్‌ ఇప్పటికే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న జట్టు. దీనికి తోడు మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుండడం వీరికి మరింత కలిసిరానుంది’ అని గాయంతో టోర్నీకి దూరమైన ఆస్ర్టేలియా జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.


ఇవీ చదవండి:

టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ

భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..

భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 05:09 AM