AC White Color:ఏసీలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకొస్తాయి.. సీక్రెట్ ఏమిటి..
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:09 PM
Why are air conditioners white: ఏసీ ఏ రంగులో ఉంటుందని అడగ్గానే ముందుగా అందరికీ గుర్తొచ్చింది తెలుపు. ఇంట్లో, ఆఫీసులో, ఇలా ఎక్కడైనా సరే.. ఎయిర్ కండీషనర్లు ఎక్కువగా వైట్ కలర్లోనే దర్శనమిస్తుంటాయి. వేరే కలర్లో ఉన్న ఏసీలు కనిపించడం అరుదు. దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటో మీకు తెలుసా..

Why air conditioners are typically white: ఇంట్లో, ఆఫీసు కార్యాలయాల్లో లేదా పరిసరాల్లో ఎయిర్ కండిషనర్ (ఏసీ) ఏ రంగులో గమనించారా.. తెలుగు రంగు కాక ఆకుపచ్చ, నీలం, ఎరుపు, లేదా పసుపు రంగుల్లో ఉన్న ఏసీ సెట్లు ఎప్పుడైనా చూశారా. వాస్తవానికి ఏసీలు తెలుపు రంగులో తప్ప వేరే కలర్లో లభించడం అరుదు. మీరు బాగా పరిశీలిస్తే ఏసీ వెలుపలి భాగంతో పాటు స్ప్లిట్ AC, విండో AC ఇలా ప్రతిదీ తెలుపు లేదా ఆఫ్-వైట్ లోనే ఉంటాయి. వేరే రంగుల్లో ఉన్నవి కనిపించనే కనిపించవు. దీని వెనుక కారణం ఏమిటి? ACలకు తెలుపు రంగులనే ఎందుకు వేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమిదే..
AC తెల్లగా ఉండటానికి కారణం ఏమిటి?
తెలుపు రంగు సూర్యరశ్మిని తక్కువగా గ్రహిస్తుంది కాబట్టి AC యూనిట్లు అన్నీ తెలుపు రంగులో ఉంటాయి. నిజానికి తెలుపు లేదా లేత రంగులు సూర్యకాంతిని, వేడిని ఎక్కువగా గ్రహించవు. అందుకే AC వేడెక్కకుండా నిరోధించేందుకు తెలుపు రంగు వేస్తారు. ఈ కారణంగా ఏసీ లోపల అమర్చిన కంప్రెసర్‌లో వేడి పెరిగినా ఏం కాదు. ఏసీ వెలుపల ప్రాంతం కూడా వేడెక్కకుండా రక్షించాలంటే మీరు దీనిని నీడలో ఉంచడం మంచిది.
మండే ఎండల్లో తెలుపు రంగులో ఉండే త్వరగా చెడిపోవు. సమర్థవంతంగా పనిచేస్తాయి. అదే ముదురు రంగులు అయితే అధిక ఉష్ణోగ్రతలను, సూర్యరశ్మిని ఇట్టే గ్రహిస్తాయి. కాబట్టి ఏసీ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందకే చాలా కంపెనీలు ఏసీల కోసం ప్రత్యేకంగా తెల్లటి పెయింట్‌ను తయారు చేస్తున్నాయి. దీనివల్ల AC ఎక్కువకాలం మన్నిక వస్తుంది. AC జీవితకాలాన్ని పొడిగించడమే కాదు. అద్భుతమైన శీతలీకరణను కూడా అందిస్తుంది. అందుకే పెద్దలు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తెల్లటి దుస్తులు ధరించాలని సూచిస్తుంటారు.
టీవీ ఎందుకు నల్లగా ఉంటుంది?
మీరు అన్ని టీవీలు నలుపు రంగులో ఉండటం గమనించే ఉంటారు. దీని వెనుక నిర్దిష్ట శాస్త్రీయ కారణం లేదు కానీ ఒక లాజిక్ ఉంది. టీవీ నల్లగా ఎందుకుంటుందంటే.. టీవీ ప్లే అవుతున్నప్పుడు పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు టీవీ బాడీ బలహీనంగా ఉంటే విరిగిపోయే అవకాశం ఉంది. ఇతర రంగులతో పోలిస్తే నలుపు రంగు స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎందుకంటే, దీన్ని బలోపేతం చేసేందుకు కార్బన్ బ్లాక్ ఉపయోగిస్తారు. అదేవిధంగా, కారు టైర్లు నల్లగా ఉండటం గమనించే ఉంటారు. నిజానికి మొదట టైర్లు తయారు చేసినప్పుడు తెల్లగా ఉండేవంట. అందువల్ల వాహనం బరువును తట్టుకోలేకపోయేది. తర్వాత టైర్లను బలోపేతం చేయడానికి బ్లాక్ కార్బన్ వినియోగించారు. టీవీ విషయంలో కూడా అంతే.
Kitchen Hacks: మీరు కొంటున్న కందిపప్పు నిజమైనదా లేదా నకిలీదా.. తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు..
Heat relief solutions: సమ్మర్‌లో శరీర వేడి తగ్గేందుకు కొన్ని చిట్కాలు..