Share News

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..

ABN , Publish Date - Apr 02 , 2025 | 06:19 PM

క్రికెట్ ప్రియులకు కీలక అప్‌డేట్. దిగ్గజ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా.. తాజాగా GEPLలో ముంబై ఫ్రాంచైజీ యజమానిగా మారారు. దీంతో GEPL సీజన్ 2 కొత్త మార్పులతో మరింత ఉత్సాహభరితంగా మారనుంది.

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..
Sara Tendulkar

ఐపీఎల్ 2025లో ఇప్పటికే కావ్య మారన్‌ను చూస్తున్న క్రికెట్ అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar).. గ్లోబల్ ఇ క్రికెట్ ప్రీమియర్ లీగ్ (GEPL) సీజన్ 2లో ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసి, యజమానిగా మారారు. ఈ విషయాన్ని డిజిటల్ ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన జెట్ సింథసిస్ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-క్రికెట్ వినోద లీగ్ అయిన GEPL, 300 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. దీని ప్రారంభ సీజన్ నుంచి లీగ్ మంచి వృద్ధిని సాధించింది. ఆటగాళ్ల ఆసక్తిలో ఐదు రెట్లు పెరుగుదలతో, సీజన్ 1లో 200,000తో పోలిస్తే 910,000 రిజిస్ట్రేషన్లకు చేరుకుంది.


గతంలో కూడా..

నిజానికి, సారా టెండూల్కర్ గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ (GEPL)లో "ముంబై గ్రిజ్లీస్" జట్టును కొనుగోలు చేసింది. ఇది 10 జట్లు పాల్గొనే గేమింగ్ లీగ్. ఈ జట్టు యజమాని అయిన తర్వాత సారా టెండూల్కర్ వెలుగులోకి వచ్చింది. సారా క్రికెట్‌కు పెద్ద అభిమాని కాగా, ఆమె తరచుగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు సపోర్ట్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె తండ్రి సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఆమె సోదరుడు అర్జున్ టెండూల్కర్ కూడా ప్రస్తుతం అదే జట్టులో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సారాకు ముంబైతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు.


సారా ఏమన్నారంటే..

సారా టెండూల్కర్ ఈ విషయంపై మాట్లాడుతూ క్రికెట్ మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైందన్నారు. GEPLలో ముంబై ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడం ద్వారా తన కల నిజమైందన్నారు. ఈ ఆట పట్ల తనకున్న మక్కువను ముంబైతో కలిసి కొనసాగించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లతో లీగ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో GEPL సీజన్ 2 మరింత కొత్తగా ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో జట్టు ఫార్మాట్‌లు, పోటీ స్థాయిలు, వ్యూహాత్మక, వాస్తవికతను మిళితం చేస్తూ కొత్త సవాళ్లను ప్రవేశపెట్టనున్నారు. రియల్ క్రికెట్ 24 ఆధారిత గేమ్‌ప్లేతో ఈ సీజన్ మరింత సూపర్‌గా మారనుంది.


గతంలో కూడా వార్తల్లో

సారా టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం కారణంగా గతంలో కూడా వార్తల్లో నిలిచారు. ఆమె సోషల్ మీడియాలో తన పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తుంది. ఇటీవల సచిన్ సారాకు ఒక పెద్ద బాధ్యతను అప్పగించాడు. ఆమె సచిన్ టెండూల్కర్ ఓ ఫౌండేషన్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా సచిన్ సారా పట్ల గర్వంగా ఉన్నట్లు చెప్పారు. ప్రజలకు సహాయం చేయడం, సమాజానికి తోడ్పడటం పట్ల ఆమెకు ఎప్పుడూ మక్కువ ఉందన్నారు.


ఇవి కూడా చదవండి:

Yashasvi Jaiswal: ముంబై జట్టుకు గుడ్ బాయ్ చెప్పిన యశస్వి జైస్వాల్..అసలేమైంది..


Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 02 , 2025 | 06:48 PM