IPL 2025: సునీల్ నరైన్ అరుదైన ఫీట్.. ఐపీఎల్‌లో వంద సిక్స్‌ల రికార్డు
ABN , Publish Date - Mar 22 , 2025 | 09:05 PM
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగుతోంది.

కోల్‌కతా (Kolkakta)లోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఈ సీజన్ (IPL 2025) తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు టీమ్‌కు కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ సునీల్ నరైన్ (sunil narine) చుక్కలు చూపించారు. ఇద్దరూ ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు (KKR vs RCB).
బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తిస్తూ నరైన్ సిక్స్‌లతో హోరెత్తించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో వంద సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు ఐపీఎల్ 2025 (IPL 2025) ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వేల మంది ప్రేక్షకుల మధ్య సంబరాలు జరిగాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని రసవత్తరంగా నడిపించాడు. విరాట్ కోహ్లీతో కలిసి వేదికపై సందడి చేశాడు. ముఖ్యంగా కోహ్లీ, షారూక్ కలిసి చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఇద్దరూ కలిసి జూమే జో పఠాన్ పాటకు ఇద్దరూ కలిసి చక్కటి సింక్‌తో డ్యాన్స్ చేశారు.
మొత్తం అన్ని ఐపీఎల్ సీజన్లలో ఒకే జట్టు తరఫున ఆడిన ఒకే ఒక్క ఆటగాడు కోహ్లీ అంటూ షారూక్ పరిచయం చేశాడు. ఇక, షారూక్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిశా పటాని తన హాట్ డ్యాన్స్‌తో అలరించింది. ఇక, ప్రముఖ సింగర్ కరణ్ ఔజ్లా తన ఆట, పాటతో అదరగొట్టాడు. శ్రేయా ఘోషల్ తన మెస్మరైజింగ్ వాయిస్‌తో అలరించింది. హాట్ భామ దిశా పటానీ తన హాట్ డ్యాన్స్‌తో అలరించింది.
ఇవి కూడా చదవండి..
IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే
IPL 2025: బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..