GT vs PBKS Prediction: గుజరాత్ వర్సెస్ పంజాబ్.. బోణీ కొట్టేదెవరో..
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:06 PM
Gujarat vs Punjab: ఐపీఎల్ 2025 బరిలోకి దిగుతున్నాయి గుజరాత్-పంజాబ్ జట్లు. తొలి మ్యాచ్‌లోనే నెగ్గి ఘనంగా కొత్త సీజన్‌ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరాటానికి అంతా సిద్ధమైంది. రోజులు గడిచేకొద్దీ థ్రిల్లింగ్ మ్యాచులతో హీటెక్కిస్తున్న క్యాష్ రిచ్ లీగ్‌లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. మరో కప్పు గెలవాలని చూస్తున్న గుజరాత్ టైటాన్స్, తొలి ట్రోఫీ కోసం వెయిట్ చేస్తున్న పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్‌లోనే బోణీ కొట్టి దూసుకెళ్లాలని ఇరు జట్లు పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి.. ఎవరు గెలుస్తారనేది.. ఇప్పుడు చూద్దాం..
బలాలు
గుజరాత్: మెగా ఆక్షన్‌లో తోపు బ్యాటర్ జోస్ బట్లర్‌ను దక్కించుకుంది జీటీ. అతడితో పాటు మరో ఓపెనర్‌గా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎలాగూ ఉన్నాడు. వీళ్లతో పాటు గత సీజన్‌లో అదరగొట్టిన సాయి సుదర్శన్ ఎలాగూ ఉన్నాడు. రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ లాంటి క్వాలిటీ ఆల్‌రౌండర్స్ కూడా జీటీకి అండగా ఉన్నాడు. రషీద్ ఖాన్, సుందర్, సిరాజ్, రబాడతో బౌలింగ్ యూనిట్ కూడా దుర్భేద్యంగా ఉంది.
పంజాబ్: ఈ టీమ్‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యరే పెద్ద బలం. అతడికి తోడు నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో యాన్సన్, మార్కస్ స్టొయినిస్.. ఇలా చాలా మంది స్టార్లు ఉన్నారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్ పెద్ద దిక్కుగా ఉన్నారు.
బలహీనతలు
గుజరాత్: జీటీ మిడిలార్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఫిలిప్స్, తెవాటియా ఉన్నా వాళ్లు కన్‌సిస్టెంట్‌గా రన్స్ చేస్తారా అనేది అనుమానమే. గత సీజన్‌లో వీళ్ల యావరేజ్ 22.18 మాత్రమే. బౌలింగ్‌లోనూ రబాడ ఎంత వరకు రాణిస్తాడో చెప్పలేని పరిస్థితి. షమి స్థానంలో వచ్చిన సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపగలడా అనేది కూడా సందేహమే.
పంజాబ్: అయ్యర్ సేన ఓపెనింగ్‌లో వీక్‌గా కనిపిస్తోంది. కొత్త కుర్రాడు ప్రియాంక్ ఆర్య ఏమేరకు ప్రభావం చూపగలడనేది ఆసక్తికరం. బిగ్ స్టేజ్‌లో ఒత్తిడిని తట్టుకొని అతడు ఆడగలడా అనేది చూడాలి. ఒక్క ఓటమితో ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చేసే పంజాబ్‌లో ఆటగాళ్లకు తమ రోల్స్ మీద క్లారిటీ, టీమ్‌లో చోటు మీద గ్యారెంటీ లేదు. దీన్ని ఎదుర్కొని వాళ్లు ఎంతమేరకు పెర్ఫార్మ్ చేస్తారో చెప్పలేని పరిస్థితి.
రికార్డులు
ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 2 మ్యాచుల్లో పంజాబ్, 3 మ్యాచుల్లో గుజరాత్ విజయం సాధించాయి. చివరగా గత సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో జీటీ నెగ్గింది. రెండు జట్లను పేపర్ మీద చూస్తే పంజాబ్ కాస్త బలంగా కనిపిస్తోంది. కానీ క్వాలిటీ ఆటగాళ్లు, కన్‌సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేసేవాళ్లు జీటీలో ఉన్నారు. హోమ్ కండీషన్స్ కూడా ఆ టీమ్‌కు కలిసొచ్చే చాన్స్ ఉంది.
విన్నింగ్ ప్రిడిక్షన్: బలాబలాలు, రికార్డులు, ప్రస్తుత ఫామ్, స్క్వాడ్స్.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకొని చూస్తే ఇవాళ్టి పోరులో గుజరాత్ గెలవడం ఖాయం.
ఇవీ చదవండి:
పంత్‌కు క్లాస్ పీకిన సంజీవ్ గోయెంకా
ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
ఉప్పల్ స్టేడియానికి థమన్.. దుమ్ములేపేలా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి