Home Loan: ఫిక్స్డ్ వర్సెస్ ఫ్లోటింగ్ హోమ్ లోన్ వడ్డీ రేటు..ఈ రెండింటిలో ఏది బెస్ట్..
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:37 PM
హోమ్ లోన్ తీసుకోవడం అనేది అనేక మందికి ఒక పెద్ద నిర్ణయమని చెప్పవచ్చు. అయితే ఈ లోన్ తీసుకునే విషయంలో వడ్డీ రేటు చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు ఫిక్స్డ్ వడ్డీ రేటు, ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే మీరు లోన్ తీసుకోవడం మరింత సులభమవుతుంది.

ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో సొంతిళ్లు కట్టుకోవాలని భావిస్తారు. ఆ కళను సాధించడానికి, వారు సంపాదించిన మొత్తంలో ప్రతి నెల కూడా కొంత మొత్తాన్ని సేవ్ చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు లేదా కట్టుకునే విషయంలో హామ్ లోన్ (Home Loan) చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో మీరు హామ్ లోన్ తీసుకునేందుకు బ్యాంకుకు వెళితే అక్కడి మేనేజర్ మీరు ఎలాంటి వడ్డీ రేటు ఎంచుకుంటారని ప్రశ్నిస్తారు. ఆ క్రమంలో మీకు ఎంత మొత్తం కావాలి, ఎన్నేళ్లు వ్యవధికి లోన్ తీసుకుంటారనే ప్రశ్నలు వస్తాయి. వీటి విషయంలో మాత్రం మీకు తప్పకుండా క్లారిటీ ఉండాలి. లేదంటే లోన్ తీసుకున్న తర్వాత నష్టపోయే అవకాశం ఉంటుంది.
లోన్ తీసుకునేటప్పుడు..
ఈ క్రమంలో మునుపటి పేమెంట్ల చార్జీలు, వడ్డీ రేటు మార్పులు, ఫిక్స్ డ్, ఫ్లోటింగ్ రేట్ల మధ్య తేడా గురించి తెలుసుకోవాలి. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు, ఫిక్స్డ్ (Fixed), ఫ్లోటింగ్ (Floating) వడ్డీ రేట్లలో ఏది ఎంచుకోవాలనే నిర్ణయం చాలా ముఖ్యం. ఫిక్స్డ్ రుణ వ్యవధిలో వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. అయితే ఫ్లోటింగ్ విధానంలో మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
ఫిక్స్డ్ వడ్డీ రేటు (Fixed Rate of Interest)
ఫిక్స్డ్ వడ్డీ రేటులో, మీరు తీసుకున్న రుణంపై వడ్డీ రేటు మొత్తం లోన్ గడువులో మారకుండా అలాగే ఉంటుంది. అంటే, మీరు మొదట్లో నిర్ణయించిన వడ్డీ రేటు మొత్తం రుణం చెల్లించే వరకు అలాగే స్థిరంగా ఉంటుంది. ఇది మారదు. కాబట్టి మీరు ముందే భవిష్యత్తులో ఎంత అవుతుంది, మొత్తం ఎంత కట్టాలనేది తెలిసిపోతుంది.
ఫిక్స్డ్ వడ్డీ రేటు ప్రయోజనాలు
ఫిక్స్డ్ వడ్డీ రేటు పెరగడం లేదా తగ్గడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్ పరిస్థితులు మారినా కూడా మారకుండా అలాగే ఉంటుంది
ఈ రేటు వల్ల మీరు మొత్తం రుణం భరించాలన్న ప్రణాళికను ముందే తెలుసుకోవచ్చు. మీరు చేసే EMI మొత్తం గడువులో కూడా మారదు
స్థిరమైన వడ్డీ రేటుతో మీరు భవిష్యత్తులో కూడా ఇదే మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది.
ఫిక్స్డ్ వడ్డీ రేటు నష్టాలు
ఫిక్స్డ్ వడ్డీ రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు అధిక వడ్డీ చెల్లించే అవకాశం ఉంది
వడ్డీ రేటు తగ్గినా మీరు లాభం పొందలేరు. మార్కెట్లో వడ్డీ రేటు తగ్గినా కూడా మీ వడ్డీ రేటు మాత్రం మారదు
ఫ్లోటింగ్ వడ్డీ రేటు (Floating Rate of Interest):
ఫ్లోటింగ్ వడ్డీ రేటులో మీరు తీసుకున్న రుణంపై వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుంది. అంటే మీరు మొదట్లో తీసుకున్న వడ్డీ రేటు మారుతుంది. అంతేకాదు ఇది తరచుగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) మార్కెట్ వడ్డీ రేటును ఫ్లోటింగ్ రేటు నిర్ణయించడానికి ఆధారంగా తీసుకుంటాయి.
ఫ్లోటింగ్ వడ్డీ రేటు ప్రయోజనాలు:
ఫ్లోటింగ్ వడ్డీ రేటులో మీరు వడ్డీ రేటు తగ్గినప్పుడు లాభం పొందవచ్చు. ఈ వడ్డీ రేటు తగ్గితే, మీరు EMI తక్కువ చెల్లించాల్సి వస్తుంది
మాములుగా ఫ్లోటింగ్ వడ్డీ రేటు, ఫిక్స్డ్ వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. దీంతో మీ EMIలు మొదట్లో తక్కువగా ఉండే ఛాన్సుంది
ఫ్లోటింగ్ వడ్డీ రేటు నష్టాలు:
వడ్డీ రేటు పెరిగినప్పుడు, మీరు తిరిగి ఎక్కువ EMIని చెల్లించాలి. ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది
మొదట్లో ఈ వడ్డీ రేటు తక్కువ ఉన్నా కూడా భవిష్యత్తులో పెరిగితే, మీరు పెరిగిన వడ్డీపై EMIలు చెల్లించాలి
ఆర్బీఐ రేపో రేటు మార్చడం వల్ల ఈఎంఐల వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అనేక నెలలు మార్చకుండా ఉంటే, మీ EMIల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు
వీటిలో ఏది బెస్ట్
మీరు ఒక స్థిరమైన EMIని చెల్లించి, మీ ఆర్థిక భవిష్యత్తును ఈజీగా ఉంచుకోవాలనుకుంటే ఫిక్స్డ్ వడ్డీ రేటు బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చెల్లింపులను తగినంత చెల్లించగలిగే సామర్థ్యాన్ని కల్గి ఉంటే ఫ్లోటింగ్ వడ్డీ రేటు సరైన ఎంపిక.
ఇవి కూడా చదవండి:
ATM Fee Hike: ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేసే వారికి అలర్ట్..ఆర్‌బీఐ కీలక నిర్ణయం..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News