Share News

నిన్న బర్డ్‌ఫ్లూ.. ఇప్పుడు ఎఫ్‌పీవీ.. ఏంటి ఈ కొత్త వైరస్

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:06 PM

మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఇది కర్ణాటక వాసులను తీవ్రంగా కలవరపెడుతుంది. ఎఫ్‌పీవీ అనే ఈ వైరస్ పిల్లులలో చాలా వేగంగా వ్యాపిస్తోంది.

నిన్న బర్డ్‌ఫ్లూ.. ఇప్పుడు ఎఫ్‌పీవీ.. ఏంటి ఈ కొత్త వైరస్
FPV Virus In Cat

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా వందల్లో కోళ్లు చచ్చిపోతున్నాయి. మన దగ్గర బర్డ్ ఫ్లూ కలకలం పూర్తిగా సద్దుమణగకముందే.. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మరో డెంజరస్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చింది. పిల్లుల్లో ఇది వెలుగు చూస్తుంది. ఎఫ్‌పీవీగా పిలిచే ఈ వైరస్ సోకి.. రాయచూర్ జిల్లాలో వందల్లో పిల్లులు చచ్చిపోయాయి. ఈ వైరస్ బారిన పడితే.. బతికేందుకు కేవలం ఒక్క శాతం అవకాశం మాత్రమే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వైరస్ వల్ల మనుషులు, కుక్కలకు ఎలాంటి ప్రమాదం లేదని.. కాకపోతే అప్రమత్తంగా ఉండటం అవసరం అంటున్నారు. పిల్లులను పెంచుకునేవారు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఈ వైరస్ కారణంగా రాయ్‌చూర్ జిల్లాలో వందల కొద్ది పిల్లులు చనిపోయాయి. చాలా వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు సరైన ట్రీట్‌మెంట్ అందుబాటులో లేదంటున్నారు నిపుణులు. ఈ వైరస్ బారిన పడ్డ పిల్లులు బతకడం చాలా కష్టమని.. 100 పిల్లులు వైరస్ బారిన పడితే వాటిల్లో కేవలం ఒక్కటి మాత్రమే బతికేందుకు అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రమాదకరమైన ఈ ఎఫ్‌పీవీ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ రాష్ట్రం అంతా వ్యాప్తిస్తుందని.. కావున పిల్లులను పెంచుకునేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత నెలలో రాయచూర్‌లో వందల కొద్ది పిల్లులు ఈ వైరస్ బారిన పడ్డాయి.


ఈ వైరస్ చాలా ప్రమాదం అని.. ఒక్క పిల్లి వైరస్ బారిన పడితే.. చాలా త్వరగా.. క్షణాల వ్యవధిలోనే సమీపంలోని పిల్లులకు వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎడినబర్గ్ యానిమల్ ఆస్పత్రి ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఎఫ్‌పీవీ వైరస్‌ వల్ల మనుషులకు, కుక్కలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. మనుషుల బట్టలు, షూస్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని తెలిపారు. పెంపుడు పిల్లుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు..

దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..

Updated Date - Mar 25 , 2025 | 03:15 PM