IPL 2025, SRH vs LSG: హైదరాబాద్‌కు కళ్లెం వేసిన లఖ్‌నవూ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Mar 27 , 2025 | 09:19 PM
300 పరుగులు కొట్టాలని ప్లాన్ చేసుకున్న హైదరాబాద్‌ను లఖ్‌నవూ బౌలర్లు 200 లోపే ఆపేశారు. టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో లఖ్‌నవూ బౌలర్లు సత్తా చాటారు. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై చక్కగా బౌలింగ్ చేశారు. చక్కటి ప్లానింగ్‌తో బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కట్టడి చేశారు. 300 పరుగులు కొట్టాలని ప్లాన్ చేసుకున్న హైదరాబాద్‌ను 200 లోపే ఆపేశారు. టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.
లఖ్‌నవూ బౌలర్లు శార్దూల్ ఠాకూర్ (4/34) రాణించడంతో హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. మొదటి నుంచి ఇబ్బంది పడ్డ అభిషేక్ శర్మ (6)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత బంతికే ఇషాన్ కిషన్ (0)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 3 సిక్స్‌లు, 5 ఫోర్లతో 47) పరగులు చేశాడు. బౌండరీలతో హోరెత్తించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ట్రావిస్ హెడ్‌ను ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి (32), హెన్రిచ్ క్లాసెన్ (26) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
చివర్లో అనికేత్ (13 బంతుల్లో 36) అద్భుతమైన టైమింగ్‌తో బౌండరీలు కొట్టాడు. అలాగే ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. లఖ్‌నవూ బౌలర్లలో శార్దూల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. లఖ్‌నవూ బ్యాటర్ల ముందు 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
ఇవి కూడా చదవండి..
Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..