MS Dhoni CSK: దోనీ రేంజ్ ఇది.. ఈ వీడియో చూస్తే సంబరం పీక్స్‌కు వెళ్లడం పక్కా!
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:27 PM
ధోనీ సునిశిత దృష్టికి తిరుగేలేదని మరోసారి రుజువైంది. ముంబై ఇండియన్స్‌లో జరిగిన ఈ అద్భుతం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: నిన్న సీఎస్‌కే వర్సెస్ ఎమ్ఐ ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ రేంజ్ ఎంటో మరోసారి స్పష్టంగా కనిపించింది. మ్యాచ్‌లో ధోనీ స్కోరే చేయకపోయినా జట్టును ముందుకు నడిపించడంలో అతడి పాత్ర ఎంత కీలకమో స్పష్టం చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియో చూశాక ధోనీ అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ దటీజ్ ధోనీ అని కామెంట్ చేస్తున్నారు.
Also Read: వీల్‌చైర్‌లో ఉన్నా.. వదలరు!
మ్యాచ్‌ను ధోనీ ఎంత సునిశితంగా గమనిస్తుంటాడో, అతడి అభిప్రాయాలు టీమ్‌కు ఎంతటి విలువైనవో 18వ ఓవర్‌లో తేటతెల్లమైంది. ఆ ఓవర్‌లో నేథన్ ఎల్లిస్ చివరి బంతిని మిచెల్ శాంట్నర్ వైపు సంధించాడు. బంతి ప్యాడ్స్‌కు తగలడం చూసి నేథన్ సంబరపడ్డాడు. ఓ వికెట్ పడిందనే అనుకున్నాడు. కానీ అంపైర్ మాత్రం ఔట్ ప్రకటించలేదు. దీంతో, ఆశ్చర్యపోయిన నేథన్.. వికెట్ కీపింగ్ చేస్తున్న ధోనీ వైపు చూశాడు. శాంట్నర్ అవుట్ అయ్యాడనే అనుకున్నానని సైగ చేశాడు.
Also Read: పెళ్లి ఎప్పుడు బ్రో అంటూ ప్రశ్న.. తెగ సిగ్గుపడిపోయిన నితీశ్ రెడ్డి
దీంతో, క్షణకాలం పాటు ఆలోచించిన ధోనీ రివ్యూకు వెళదామని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు చెప్పాడు. అతడి సూచన మేరకు రివ్యూకు వెళ్లితే ధోని అంచనా నిజమని తేలింది. మిచెల్ అవుటైనట్టు థర్డ్ అంపైర్ ప్రకటించడంతో సీఎస్‌కే ప్లేయర్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇక ఎల్లిస్ సంబరానికైతే అంతేలేకుండా పోయింది. సంతోషంలో అతడు ధోనిని ఆలింగనం చేసుకున్నాడు. ఇక సీఎస్‌కే అభిమానుల కేరింతలకు స్టేడియం దద్దరిల్లింది. మ్యాచ్‌లో ధోని ఒక్క పరుగు కూడా స్కోర్ చేయకపోయినా అతడి సునిశిత దృష్టి, అనుభవం జట్టుకు ఇలా అక్కరకు వచ్చింది. ఇక వీడియో చూసిన జనాలు ధోనీ రివ్యూ సిస్టమ్‌కు మించినది లేదని కామెంట్ చేస్తున్నారు. అతడుంటే థర్డ్ అంపైర్ అవసరమే ఉండని కామెంట్ చేస్తున్నారు.
Also Read: వావ్.. పరుగుల వరద.. ఈ హైలైట్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేము
ఫీల్డింగ్‌లో కూడా ధోనీ తనదైన మార్కు కనబరిచాడు. 43 ఏళ్ల వయసులో చిరుతలా కదులుతూ వికెట్ కీపింగ్ చేశాడు. ముఖ్యంగా నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఎమ్‌ఐ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ధోనీ ఔట్ చేసిన తీరు అభిమానులను ఆశ్చర్యానందాల్లో ముంచెత్తింది. ఇక సీఎస్‌కు ఎనిమిది బంతుల్లో నాలుగు రన్లు కావాల్సిన తరుణంలో బ్యాట్ పట్టిన ధోని కేవలం రెండు బంతులు ఆడి స్కోరేమీ చేయకుండానే వెనుదిరిగాడు. కానీ అతడి ప్రభావం మాత్రం మ్యాచ్‌పై స్పష్టంగా కనిపించింది.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి