Share News

New Zealand : చాంపియన్‌ న్యూజిలాండ్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:54 AM

చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు అత్యంత ఆత్మవిశ్వాసం లభించే విజయం న్యూజిలాండ్‌ అందుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్‌ టైటిల్‌ను ఆ జట్టు దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య పాకిస్థాన్‌ను

New Zealand : చాంపియన్‌ న్యూజిలాండ్‌

‘ముక్కోణపు’ ఫైనల్లో పాకిస్థాన్‌ ఓటమి

కరాచీ: చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు అత్యంత ఆత్మవిశ్వాసం లభించే విజయం న్యూజిలాండ్‌ అందుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్‌ టైటిల్‌ను ఆ జట్టు దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య పాకిస్థాన్‌ను ఐదు వికెట్లతో కివీస్‌ ఓడించింది. తొలుత పాకిస్థాన్‌ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రిజ్వాన్‌ (46), సల్మాన్‌ ఆఘా (45), తయ్యబ్‌ (38) రాణించారు. ఒరౌర్క్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో న్యూజిలాండ్‌ 45.2 ఓవర్లలో 243/5 స్కోరు చేసి నెగ్గింది. మిచెల్‌ (57), లాథమ్‌ (56), కాన్వే (48) అదరగొట్టారు. నసీమ్‌ షా రెండు వికెట్లు తీశాడు.

Updated Date - Feb 15 , 2025 | 05:54 AM