CSK Vs RCB: సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం.. 17 ఏళ్ల తరువాత చెన్నైలో జయకేతనం
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:54 PM
సొంతగడ్డపై చెన్నైని బెంగళూరు మట్టికరిపించింది. దాదాపు 17 ఏళ్ల తరువాత అరుదైన విజయాన్ని అందుకుంది. హేజల్‌వుడ్, దయాళ్ కీలక దశల్లో వికెట్లు తీసి చెన్నై పతనాన్ని శాసించారు.

ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై అజేయమైన జట్టుగా పేరు పడ్డ సీఎస్కేకు భారీ షాక్ తగిలింది. దాదాపు 17 ఏళ్ల తరువాత చెన్నైని ఆర్సీబీ చిత్తుగా ఓడించిండి. 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో స్పష్టమైన ఆధిపత్యం కనబర్చిన బెంగళూరు.. జయకేతనాన్ని ఎగరవేసింది. ఛేదనలో సీఎస్కేకు ఆదిలోనే బ్రేకులు వేసిన పేసర్ హేజల్‌వుడ్, కీలక దశలో రచిన్ వికెట్ పడగొట్టిన దయాళ్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read: కోహ్లీపై ధోని DRS అప్పీల్.. రివ్యూ ఏమైందో తెలుసా, ఫ్యాన్స్ ఫిదా..
సీఎస్కే టాస్ గెలవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి బంంతి నుంచే దూకుడు మొదలెట్టింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ తొలి ఓవర్ల నుంచే బౌండరీలు రాబట్టి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. స్వల్ప స్కోరుకే (16 బంతుల్లో 32 పరుగులు) అతడు వెను దిరిగినా ఆ తరువాత రజత్ పటీదార్ ఆర్సీబీకి కీలకంగా మారాడు. అర్ధశతకంతో(51 పరుగులు; 32 బంతులు 4x4, 3x6) చెలరేగి జట్టుకు భారీ స్కోరు దిశగా నడిపించాడు విరాట్ కోహ్లీ కూడా ఓ మోస్తరు ఆటతీరు కనబరిచాడు. చివర్లో టిమ్ డేవిడ్ వరుస సెక్సుల కారణంగా ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగిలింది.
Also Read: కావ్యా పాపను బాధపెట్టారు కదరా..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆది నుంచే తడబటం ప్రారంభించింది. జాష్ హేజల్‌వుడ్ చెన్నై ఓటమికి పునాది వేశాడు. ఆదిలోనే కీలకమైన మూడు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆ తరువాత కీలక మిడిల్ ఓవర్లలో యశ్ దయాలు రెండు వికెట్లు తీయడంతో సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. లివింగ్ స్టోన్ మరో రెండు వికెట్లు తీయడంతో సీఎస్కే ఓటమి మూటగట్టుకుంది. 148 పరుగులకే పెవిలియన్ బాట పట్టింది. ఛేదనలో సీఎస్‌కే అనుసరించిన వ్యూహాలు కూడా బెడిసి కొట్టాయి. శివమ్ దూబే కంటే ముందే శామ్ కుర్రన్‌ను దింపడటం, ధోనీ నెం.9గా బ్యాటింగ్ చేయడానికి రావడంతో చెన్నైకి భారీ స్కోరు చేసే అవకాశాలు చేజారినట్టైంది. చివరి ఓవర్లో ధోనీ 30 పరుగులు చేయడం సీఎస్కే అభిమానులకు కొంతలో కొంత సాంత్వన చేకూర్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి