IPL 2025 SRH Vs RR Highlights: వావ్.. పరుగుల వరద.. ఈ హైలైట్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేము.
ABN , Publish Date - Mar 24 , 2025 | 08:02 AM
నిన్నటి ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఈ మ్యాచ్ హైలైట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

నిన్న జరిగిన హైదరాబాద్ సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్‌లో పరుగుల వరద పారింది. అసలే దూకుడుగా ఆడే ఎస్ఆర్‌హెచ్ రాజస్థాన్ రాయల్స్ పేలవ బౌలింగ్ ఫీల్డింగ్ ఆసరగా రెచ్చిపోయింది. గత సీజన్ నాటి దూకుడును కొనసాగిస్తూ పరుగుల వరద పారించింది. అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాగిన ఈ మ్యాచ్‌లో హైలట్స్, టర్నింగ్స్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి.
ఇషాన్ కిషన్ సెంచరీ: SRH తరపున తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106* (11 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి తన తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి పరుగుల వరద ఎలా ఉంటుందో చూపించాడు. ఎస్ ఆర్ హెచ్‌కు ట్రావిస్ హెడ్ అద్భుతమైన శుభారంభాన్ని ఇచ్చాడు. 31 బంతుల్లో 67 (9 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి, అభిషేక్ శర్మ (24, 11 బంతులు)తో కలిసి పవర్‌ప్లేలో 94 పరుగులు పిండుకున్నాడు. పవర్ ప్లేలో ఎస్ఆర్‌హెచ్ 6 ఓవర్లలో 94/1 స్కోర్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఐదో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌గా నిలిచింది.
Also Read: వీల్‌చైర్‌లో ఉన్నా.. వదలరు!
భారీ స్కోర్ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ జైశ్వాల్ (1), రియాన్ సింగ్ (4), నితీశ్ రాణా (11) స్వల్ప స్కోరులకే నిష్క్రమించినా సామన్స్, జురెల్ చేసిన పోరాటం అభిమానుల మెప్పు పొందింది. చేజింగ్‌లో సంజు సామ్సన్ 37 బంతుల్లో 66 (26 బంతుల్లో ఫిఫ్టీ), ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 70 (19 బంతుల్లో ఫిఫ్టీ) చేసినా లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. కానీ ఒకానొక దశలో వారి దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేస్తుందన్న ఆశలు కనిపించాయి. ఆ తరువాత షిమ్రాన్ హెట్‌మైర్ 23 బంతుల్లో 42 (4 సిక్సర్లు), శుభమ్ దూబేలతో కలిసి 34 బంతుల్లో 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే, SRH బౌలర్ సిమర్‌జీత్ సింగ్ పవర్‌ప్లేలో యశస్వి జైస్వాల్ (4), రియాన్ పరాగ్ (4) వికెట్లు తీసి ఆర్ఆర్‌ని 3 వికెట్లకు కట్టడి చేశాడు. మొదట్లో ఈ వికెట్స్ పడకుండా ఉండి ఉంటే ఆట మరోలా ఉండేదని చెప్పకతప్పదు.
ఈ మ్యాచ్ పలు రికార్డులకు పురుడు పోసింది. 286/6తో ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్‌హెచ్ రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అయితే 2024లో తమ సొంత రికార్డు 287/3 కంటే ఒక పరుగు తక్కువగా ఉండటం గమనార్హం. ఇక ఆర్ఆర్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చుకుని సొంత జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో పరుగులు కోల్పోవడం (0/76) ఇదే తొలిసారి.
Also Read: ప్రియాంక రికార్డు ప్రదర్శన
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల దూకుడు, ఆర్ఆర్ పోరాట పటిమ కారణంగా ఈ గేమ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండు టీమ్‌లు కలిపి 528 పరుగులు (ఎస్ఆర్‌హెచ్ 286/6, ఆర్ఆర్ 242/6) చేసి, ఐపీఎల్‌లో రెండో అత్యధిక మ్యాచ్ టోటల్ సాధించాయి (549, SRH vs RCB, 2024 తర్వాత). తాజా మ్యాచ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ టీ20 క్రికెట్‌లో చరిత్రలో 4 సార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టుగా నిలిచింది
బౌలింగ్‌లో ఆర్ఆర్ తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 3/44 తీసి పోరాట పటిమ ప్రదర్శించాడు. చివరి ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. పవర్‌ప్లేలో ఆర్ఆర్ 3 వికెట్లు కోల్పోయినప్పటికీ, సామ్సన్-జురెల్ జోడీ 100 పరుగుల భాగస్వామ్యంతో పోరాడింది, కానీ రన్ రేట్ 16కి పైగా పెరిగి ఒత్తిడి సృష్టించింది. చివరకు ఓటమికి బాటలు పరిచింది. SRH 44 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ల ప్రతిభ హైలైట్‌గా మారినా ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి అభిమానుల మెప్పు పొందారు.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి