క్వింటన్.. మెరిసెన్..
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:24 AM
క్లిష్టమైన వికెట్‌పై క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 నాటౌట్) సత్తాచాటడంతో.. డిఫెండింగ్ చాంప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతా తెరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో...

కోల్‌కతా బోణీ
8 వికెట్లతో రాజస్థాన్ చిత్తు
డికాక్ (61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 నాటౌట్)
గువాహటి: క్లిష్టమైన వికెట్‌పై క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 నాటౌట్) సత్తాచాటడంతో.. డిఫెండింగ్ చాంప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతా తెరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో 151/9 స్కోరు చేసింది. ధ్రువ్ జురెల్ (33), యశస్వీ జైస్వాల్ (29), రియాన్ పరాగ్ (25) టాప్ స్కోరర్లు. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేధనలో కోల్‌కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. అంగ్‌క్రిష్ రఘువంశీ (22 నాటౌట్) రాణించాడు. డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సునాయాసంగా..
ఓపెనర్ డికాక్ తుదికంటా క్రీజులో నిలవడంతో.. మ్యాచ్ పూర్తిగా ఏకపక్షమైంది. రఘువంశీతో కలసి డికాక్ మూడో వికెట్‌కు 83 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో.. మరో 15 బంతులు మిగిలుండగానే నైట్‌రైడర్స్ గెలుపు గీత దాటింది. ఛేదనలో డికాక్, మొయిన్ అలీ (5) శుభారంభం అందించారు. ముఖ్యంగా డికాక్ పసలేని రాజస్థాన్ బౌలింగ్‌ను ఆడేసుకొన్నాడు. అయితే, ఏడో ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించిన అలీ రనౌట్ కావడంతో.. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మధ్య ఓవర్లలో కెప్టెన్ రహానె (18)తో కలసి డికాక్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 10 ఓవర్లకు నైట్‌రైడర్స్ 70/1 స్కోరు చేసింది. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లో హసరంగ బౌలింగ్‌లో రహానె క్యాచవుట్ అయినా.. సిక్స్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న డికాక్ దూకుడు పెంచాడు. మరోవైపు రఘువంశీ చక్కని సహకారం అందించడంతో.. సాధించాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. 18 బంతుల్లో 17 పరుగులు కావల్సి ఉండగా.. ఆర్చర్ బౌలింగ్‌లో డికాక్ ఫోర్, రెండు సిక్స్‌లతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. కానీ, సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
రాణించిన స్పిన్నర్లు
కోల్‌కతా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో.. తడబడిన రాజస్థాన్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌కు ఓపెనర్లు జైస్వాల్, సంజూ శాంసన్ (13) నిలకడైన ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌లోనే వీరిద్దరూ చెరో బౌండ్రీతో ఖాతాలు తెరిచారు. ఆ తర్వాతి ఓవర్‌లో జాన్సన్ బౌలింగ్‌లో జైస్వాల్ 4, 6తో దూకుడు పెంచాడు. కానీ, వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్న శాంసన్‌ను అరోరా అవుట్ చేయడంతో.. తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ పరాగ్, మరో ఓపెనర్ జైస్వాల్‌తో కలసి రెండో వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. పరాగ్ మూడు సిక్స్‌లతో జోరు చూపడంతో పవర్‌ప్లేను రాజస్థాన్ 54/1తో ముగించింది. అయితే, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు వరుణ్, మొయిన్ ఎంట్రీతో రాజస్థాన్ టపటపా వికెట్లు చేజార్చుకొంది. రెండు పరుగుల తేడాతో పరాగ్, జైస్వాల్ పెవిలియన్ చేరారు. పరాగ్‌ను వరుణ్ అవుట్ చేయగా.. జైస్వాల్‌ను మొయిన్ పెవిలియన్ చేర్చాడు. హసరంగ (4), నితీష్ రాణా (8) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో ఆరో వికెట్‌కు 28 పరుగులు జోడించిన జురెల్, శుభమ్ దూబే (9) టీమ్ స్కోరును సెంచరీ మార్క్ దాటించారు. అయితే, దూబేను అరోరా వెనక్కిపంపాడు. డెత్ ఓవర్లలో జురెల్, హెట్‌మయర్ (7)ను హర్షిత్ అవుట్ చేశాడు. కానీ, జోఫ్రా ఆర్చర్ (16) రెండు సిక్స్‌లు బాదడంతో.. టీమ్ స్కోరు కష్టంగా 150 దాటింది.
స్కోరుబోర్డు
రాజస్థాన్ రాయల్స్: జైస్వాల్ (సి) హర్షిత్ (బి) మొయిన్ 29, శాంసన్ (బి) అరోరా 13, పరాగ్ (స్టంప్డ్) డికాక్ (బి) వరుణ్ 25, నితీష్ రాణా (బి) మొయిన్ 8, హసరంగ (సి) రహానె (బి) వరుణ్ 4, జురెల్ (బి) హర్షిత్ 33, శుభమ్ దూబే (సి) రస్సెల్ (బి) అరోరా 9, హెట్‌మయర్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ 7, ఆర్చర్ (బి) జాన్సన్ 16, తీక్షణ (నాటౌట్) 1, దేశ్‌పాండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 151/9; వికెట్ల పతనం: 1-33, 2-67, 3-69, 4-76, 5-82, 6-110, 7-131, 8-138, 9-149; బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 4-0-42-1, వైభవ్ అరోరా 4-0-33-2, హర్షిత్ రాణా 4-0-36-2, మొయిన్ అలీ 4-0-23-2, వరుణ్ చక్రవర్తి 4-0-17-2.
కోల్‌కతా నైట్‌రైడర్స్: మొయిన్ అలీ (రనౌట్-తీక్షణ/పరాగ్) 5, డికాక్ నాటౌట్ 97, రహానె (సి) తుషార్ (బి) హసరంగ 18, రఘువంశీ (నాటౌట్) 22, ఎక్స్‌ట్రాలు : 11 ; మొత్తం : 17.3 ఓవర్లలో 153/2 ; వికెట్లపతనం : 1-41, 2-70 ; బౌలింగ్ : ఆర్చర్ 2.3-0-33-0, తీక్షణ 4-0-32-0, రియాన్ పరాగ్ 4-0-25-0, సందీప్ శర్మ 2-0-11-0, హసరంగ 3-0-34-1, నితీశ్ రాణా 1-0-9-0, తుషార్ దేశ్‌పాండే 1-0-7-0.
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..