Share News

చాహల్‌-ధనశ్రీకి విడాకులు

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:08 AM

భారత వెటరన్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మకు ఇక్కడి బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో....

చాహల్‌-ధనశ్రీకి విడాకులు

ముంబై: భారత వెటరన్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మకు ఇక్కడి బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల కూలింగ్‌ పీరియడ్‌ను బాంబే హైకోర్టు రద్దుచేసిందని చాహల్‌ తరపు న్యాయవాది నితీష్‌కుమార్‌ గుప్తా చెప్పారు. ఈనెల 20లోగా విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టును ఆదేశించిందన్నారు. కాగా రూ.4.75 కోట్ల భరణంలో భాగంగా చాహల్‌ ఇప్పటికే ధనశ్రీకి రూ.2.37 కోట్లు చెల్లించాడు. కోర్టు డిక్రీ అందిన అనంతరం మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని న్యాయవాది తెలిపారు. విడాకుల కోసం గురువారం చాహల్‌-ధనశ్రీ కోర్టుకు వచ్చారు. టీ-షర్టే చెప్పేసిందా? కోర్టుకు వచ్చినప్పుడు చాహల్‌ ధరించిన టీ-షర్ట్‌పై ‘బీ యువర్‌ ఓన్‌ షుగర్‌ డాడీ’ అని ఉండడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘ఎవరో ఇచ్చే డబ్బు, బహుమతులపై ఆశపడకుండా.. నీకాళ్లపై నువ్వు నిలబడు. నీ బాగోగులు నువ్వే చూసుకో’ అని దీని అర్థం. ఒకరకంగా ధనశ్రీ మనస్తత్వాన్ని ఉద్దేశించి చాహల్‌ ఈ విధంగా రాసిన షర్ట్‌ను వేసుకొన్నాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

పాండ్యాకు మెంటల్ టార్చర్

మరిన్ని క్రీడాతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 03:08 AM