IPL 2025: దంచి కొట్టిన రహానే, సునీల్.. ఆర్సీబీ టార్గెట్ 175 పరుగులు
ABN , Publish Date - Mar 22 , 2025 | 09:16 PM
కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు టీమ్‌కు కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ సునీల్ నరైన్ చుక్కలు చూపించారు.

కోల్‌కతా (Kolkakta)లోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఈ సీజన్ (IPL 2025) తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు టీమ్‌కు కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ సునీల్ నరైన్ (sunil narine) చుక్కలు చూపించారు. అజింక్య రహానే (31 బంతుల్లో 56) అర్ధశతకంతో అలరించాడు. సునీల్ నరైన్ 26 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు (KKR vs RCB).
బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తిస్తూ రహానే, నరైన్ సిక్స్‌లతో హోరెత్తించారు. ఆరంభంలో బెంగళూరు బౌలర్లు కట్టుదట్టింగా బౌలింగ్ చేసి ఓపెనర్ డికాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అయితే రహానే వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రహానే 4 సిక్స్‌లు, నరైన్ 3 సిక్స్‌లు కొట్టారు. అయితే వీరు అవుట్ అయిన తర్వాత బెంగళూరు మళ్లీ గేమ్‌లోకి వచ్చింది. వెంట వెంటనే వికెట్లు తీశాడు. రఘువంశీ (30) మాత్రమే రాణించాడు.
ముఖ్యంగా బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (3) తెలివిగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. హాజెల్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. శర్మ, దార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. బెంగళూరు ముందు 175 పరుగులు లక్ష్యం ఉంచింది. ఇక, భారమంతా బెంగళూరు బ్యాటర్ల పైనే ఉంది.
ఇవి కూడా చదవండి..
IPL 2025: బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..
IPL 2025, KKR vs RCB: ఈడెన్‌లో ఇప్పటివరకు ఎవరిది పైచేయి.. టాస్ గెలిస్తే ఏం చేయాలి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..