IPL 2025: కోల్‌కతాలో వైభవంగా ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు.. టాస్ గెలిచిన బెంగళూరు..
ABN , Publish Date - Mar 22 , 2025 | 07:21 PM
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వేల మంది ప్రేక్షకుల మధ్య సంబరాలు షురూ అయ్యాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని రసవత్తరంగా నడిపించారు. విరాట్ కోహ్లీతో కలిసి వేదికపై సందడి చేశాడు. ఇక, ప్రముఖ సింగర్ కరణ్ ఔజ్లా తన ఆట, పాటతో అదరగొట్టాడు. శ్రేయా ఘోషల్ తన మెస్మరైజింగ్ వాయిస్‌తో అలరించింది.

క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 (IPL 2025) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కోల్‌కతా (Kolkakta)లోని ఈడెన్ గార్డెన్స్‌లో వేల మంది ప్రేక్షకుల మధ్య సంబరాలు షురూ అయ్యాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని రసవత్తరంగా నడిపించారు. విరాట్ కోహ్లీతో కలిసి వేదికపై సందడి చేశాడు. ఇక, ప్రముఖ సింగర్ కరణ్ ఔజ్లా తన ఆట, పాటతో అదరగొట్టాడు. శ్రేయా ఘోషల్ తన మెస్మరైజింగ్ వాయిస్‌తో అలరించింది. హాట్ భామ దిశా పటానీ తన హాట్ డ్యాన్స్‌తో అలరించింది.
తాజా సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడబోతున్నాయి. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఐపీఎల్ ట్రోఫీతో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. షారూక్ ఖాన్ వీరిద్దరినీ స్టేడియంలోకి ఆహ్వానించారు. అలాగే టాస్ గెలిచిన రజత్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. రాత్రి 7:30 గంటలకు చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అంతకంటే ముందు సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రదర్శన చెన్నై అభిమానులను అలరించబోతోంది. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు చిదంబరం స్టేడియంలో అనిరుధ్ ప్రదర్శన ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
IPL 2025: బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..
IPL 2025, KKR vs RCB: ఈడెన్‌లో ఇప్పటివరకు ఎవరిది పైచేయి.. టాస్ గెలిస్తే ఏం చేయాలి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..