హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:25 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు.

టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు. ఉద్యమ పితామహుడు అప్పారి వెంకటస్వామికి గురువారం నివాళులు అర్పించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన నాలుగు వాయిదాల డీఏను, పీఆర్సీని అడగొద్దని అవి కావా లంటే నెలనెల జీతాలే ఇవ్వలేమని సీఎం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామన్నారు. ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోవడం లేదని న్యాయంగా రావాల్సిన బకాయిలను, వారు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించాలని మాత్రమే అడుగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ నాయకులు ఇందురావు, రమేష్, హేమంత్, రాజకమలా కర్‌రెడ్డి, సుభాష్, మహిపాల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.