భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:30 PM
జిల్లాలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం జిల్లా, సబ్ డివిజన్, మండల స్ధాయిల్లో ప్రతే క చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం జిల్లా, సబ్ డివిజన్, మండల స్ధాయిల్లో ప్రతే క చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సమీకృత కలె క్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నివాస ప్రాంతాలు, నిర్మాణ అనుమతులు, సరైన అనుమతులులేని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రిజిస్టర్‌లో వివరాలు నమోదుచేసి గ్రీవెన్స్ నంబర్ కేటాయించాలని ఆదేశించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రసా యిలో విచారించి 21రోజుల్లోగా సమస్యలను పరిష్క రించాలన్నారు. వయోవృదుల సంబంధిత దరఖా స్తులు అధికంగా వస్తున్నాయని, ఒంటరి మహిళ, దివ్యాంగుల సంబంధిత దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.
నకిలీ పత్తి విత్తనాల నివారణకు చర్యలు
జిల్లాలో నకిలీవిత్తనాల విక్రయం, కొనుగోళ్లు జరగ కుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి పక డ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ పత్తి విత్త నాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో, మండలాల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అవగా హన కల్పించాలన్నారు. నకిలీ విత్తనాలతో పంటలు సాగు చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, జిల్లా సరిహ ద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలని తెలిపారు. దళారులు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీవిత్తనాలను తీసుకువచ్చి మో సానికి పాల్పడుతున్నారని, రైతులు లైసెన్స్ ఉన్న డీల ర్ల వద్ద మాత్రమే నాణ్యమైన విత్తనాలను కొనాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, అధికారులు పాల్గొన్నారు.