అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:23 PM
జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులు ఈ నెల 30 లోగా పూర్తి చేసి ఎంబీ రికార్డులు సమర్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

కుమరంభీం కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులు ఈ నెల 30 లోగా పూర్తి చేసి ఎంబీ రికార్డులు సమర్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలె క్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్‌లో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కం కింద గ్రామాల్లో మంజూరైన సీసీ రోడ్లు, మురుగు కాలు వల నిర్మాణాలు ఈ నెల 30లోగా పూర్తి చేసి ఎంబీ రికార్డు లు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా మంజూరైన పనులను పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడులా నాణ్యత పాటించే విదంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.