పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:41 PM
నేటి నుంచి ప్రారం భం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

చారకొండ/ తెలకపల్లి/ వెల్దండ/ బల్మూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : నేటి నుంచి ప్రారం భం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం పలు మండలాల్లో అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి, అక్క డ ఏర్పాట్లు, వసతులపై పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీటి వసతి, వైద్యసదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనప్పటికీ పరీక్షకు అనుమ తిస్తాని, అయినా ప్రతీ విద్యార్థి అరగంట ముం దే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరిసరాలలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు పరీక్ష జరుగుతున్న సమయంలో మూసి ఉంచాలని పేర్కొన్నారు.
ఫచారకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఎంఈవో ఝాన్సీరా ణి, ఎస్‌ఐ శంషుద్దీన్‌తో కలిసి తహసీల్దార్ అద్దంకి సునీత పరిశీలించారు. ఎంఈవో మాట్లా డుతూ మండంలోని చారకొండ జడ్పీహెచ్ ఎస్‌లో 87, జూపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో 22, కేజీబీ వీలో 37, విశ్వాశాంతి హైస్కూల్‌లో 31, మొత్తం 177 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. చీప్ సూప రిండెంట్ శ్రీనివా సులు, డిపార్ట్ మెంటల్ అధికారి మురళీధర్‌రెడ్డితో పాటు 9మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివ రించారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబ స్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఫ తెలకపల్లి మండలంలో జడ్పీహెచ్‌ఎస్ గౌరెడ్డిపల్లి, జడ్పీహెచ్‌ఎస్ తెలకపల్లి, టీఎస్‌డ బ్ల్యూఆర్‌ఎస్ తెలకపల్లి, కేకే.రెడ్డి తెలకపల్లి ఇలా నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గు రువారం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ నాలుగు కేంద్రాల్లో మొత్తం 873 పరీక్ష రాస్తార ని తెలిపారు. వెల్దండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్‌లో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేసినట్లు ఎంఈవో చంద్రుడు తెలిపారు. ఈరెండు కేంద్రాలలో 354 మంది పరీక్ష రాస్తారని తెలిపారు. ఆయా కేంద్రాలకు చీఫ్ సూపరిండెంట్ అధికారులుగా రవీందర్, బాలీశ్వర్, డిపార్ట్‌మెంటల్ అధికారులుగా రవికిరణ్, శ్రావన్‌కుమార్‌లతోపాటు మరో 18 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు.