Share News

ట్రాక్టర్‌పై నుంచి కిందపడి యువకుడి దుర్మరణం

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:40 AM

భువనగిరి రూరల్‌, మార్చి 21(ఆంధ్ర జ్యోతి) : ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెం దా డు.

ట్రాక్టర్‌పై నుంచి కిందపడి యువకుడి దుర్మరణం

భువనగిరి రూరల్‌, మార్చి 21(ఆంధ్ర జ్యోతి) : ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెం దా డు. ఈ ఘటన మండలంలోని సూరే పల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. మండలంలోని ఆకుతోటబావితండా పంచాయతీ పరిధిలోని కాండ్లకుంటతండాకు చెందిన గుగులోతు ఉపేందర్‌ (21) సూరేపల్లికి వెళ్లి ట్రాక్టర్‌పై కూర్చోని తండాకు వస్తుండగా ప్ర మాదవశాత్తు జారి పడడంతో ట్రాలీ టైరు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి మార్చురిలోకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సంతో్‌షకుమార్‌ తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 12:40 AM