Share News

ప్రమాదాల నివారణకు బ్లీంకర్‌ లైట్లు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:38 AM

తుర్కపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): భువనగిరి జాతీయ రహదారిపై జేతురాం తండాలోని కాళేశ్వరం కాల్వ వద్ద ఉన్న మూల మలుపు వద్ద ప్రమాదాల నివారణకు బ్లింకర్‌ లైట్లను ఏర్పాటు చేసినట్లు యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్‌ కుమార్‌ తెలిపారు.

 ప్రమాదాల నివారణకు బ్లీంకర్‌ లైట్లు

తుర్కపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): భువనగిరి జాతీయ రహదారిపై జేతురాం తండాలోని కాళేశ్వరం కాల్వ వద్ద ఉన్న మూల మలుపు వద్ద ప్రమాదాల నివారణకు బ్లింకర్‌ లైట్లను ఏర్పాటు చేసినట్లు యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. రాచకొండ సీపీ సహకారంతో కాల్వ సమీపంలో బొలాడ్స్‌, భారీగేట్స్‌, బ్లింకర్‌ లైట్లను ఏర్పాటు చేయగా శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆయన ప్రారంభించి మాట్లాడారు. భువనగిరి-గజ్వేల్‌ జాతీయ రహదారి వయా తుర్కపల్లి మీదుగా రెండు జాతీయ రహదారులను కలుపుతున్నందున వేలాది వాహనాలు ఈ రోడ్డుపై వెళ్తున్నారు. అయితే జేతురాంతండా ఈ ప్రాంతంలో మూలమలుపు ప్రమాదకరంగా ఉండడంతో రాత్రి వేళలో వాహనాలు అదుపు తప్పి కాల్వ లో పడు తున్నాయని చెప్పారు. అంతే కాకుండా డిజిటల్‌ బోర్డును కూడ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతి పాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్టరూరల్‌, ట్రాఫిక్‌ సీఐలు కొండల్‌రావు, యెలకొండ కృష్ణ, ఎస్‌ఐ తక్యుద్దీన్‌, రోడ్‌ సేప్టీ అధికారి సమ్మయ్య పాల్గొన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

మండల కేంద్రంలోని భువనగిరి- గజ్వేల్‌ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం యాద గిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ల ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఏసీ పీ యెలగొండ కృష్ణ విలేకరులతో మాట్లాడారు. రో డ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటిం చాల ని సూచించారు. పలువురుపై కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ రాజు, పోలీస్‌లు అనీల్‌, నరేష్‌, నితీన్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:39 AM